మాజీ ఎంపీ గడ్డం వివేక్ రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడినట్లుంది. ప్రస్తుతం బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కంఫర్టబుల్ గానే ఉన్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేనట్లుంది. అందుకనే పార్టీ మారిపోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఏ పార్టీలో చేరాలనే విషయమై అభిప్రాయాలు సేకరిస్తున్నారట. ఇదే సందర్భంగా పార్టీ కార్యక్రమాలకు కూడా వీలైనంత దూరంగా ఉంటున్నట్లు టాక్.
ఇపుడు వివేక్ సమస్య ఏమిటంటే బీఆర్ఎస్ లోకి వెళ్ళాలా లేకపోతే కాంగ్రెస్ లో చేరాలా ? అని. ఇప్పటికే వివేక్ రెండు మూడు పార్టీలు మారారు. తరచూ పార్టీలు మారుతుంటారనే ముద్ర వివేక్ పైన పడిపోయింది. అయినా సరే అనుకున్నంత లబ్ది అయితే దొరకడం లేదు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయమై బాగా అయోమయం పెరిగిపోతోంది. కర్నాటక ఎన్నికల్లో ఘనవిజయంతో కాంగ్రెస్ మంచి ఊపు మీదుంది. అయితే ఈ మధ్య ఆ ఊపు కాస్త తగ్గింది.
ఇదే సమయంలో బీఆర్ఎస్ లో కాస్త హడావుడి పెరిగింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయమని కేసీయార్ పదేపదే చెబుతున్నారు. అధికారంలో ఉండటం ఆ పార్టీకి కాస్త అడ్వాంటేజ్ అన్న విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ విషయం చూస్తే అంతా పాత కాపులే కానీ తనకు సరైన గుర్తింపు ఉంటుందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే కష్టకాలంలో పార్టీని వదిలి వివేక్ వెళ్ళిపోయారు.
అప్పుడెప్పుడో పెద్దపల్లి ఎంపీగా గెలిచారంతే. మళ్ళీ చెప్పుకోదగ్గ విజయాలేమీ లేవు. ఈ నేపధ్యంలోనే కుటుంబ సభ్యులేమో బీఆర్ఎస్ లోకి వెళితే మంచిదని సలహా ఇస్తున్నారట. అయితే కాంగ్రెస్ లో చేరితేనే బాగుంటుందని సన్నిహితులు సూచిస్తున్నారట. మూడు పార్టీల విషయంలో ఒకటి ఖాయం ఏమిటంటే బీజేపీ అయితే తెలంగాణాలో అధికారంలోకి వచ్చేది అయితే లేదు. అందుకనే బీఆర్ఎస్, కాంగ్రెస్ విషయంలో వివేక్ లో అయోమయం పెరిగిపోతోందట. తీసుకున్న నిర్ణయం తప్పని తేలితే మరో ఐదేళ్ళు ప్రతిపక్షంలోనే కూర్చోవాలన్నదే అసలైన సమస్య.
This post was last modified on August 14, 2023 11:05 am
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…