రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీయార్ ప్రభుత్వం రెండు నెలలు ముదుగానే లిక్కర్ షాపులకు టెండర్ నోటిఫికేషన్ జారీచేసేసింది. పోయినసారి కన్నా ఇపుడు జారీచేసిన నోటిఫికేషన్ ద్వారా ఎక్కువ డబ్బులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికిప్పుడు ఇంత అర్జంటుగా ప్రభుత్వం రెండునెలలు ముందే నోటిఫికేషన్ ఎందుకు జారీచేసింది ? ఎందుకంటే రైతు రుణమాఫీ చేయటం కోసమే అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 2018లో రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు చప్పుడు చేయలేదు.
రాబోయే ఎన్నికల్లో ప్రచారానికి వెళితే రైతుల రియాక్షన్ ఎలాగుంటుందో కేసీయార్ కు బాగా అర్ధమైనట్లుంది. అందుకనే అర్జంటుగా నెలరోజుల్లోపు రు. 27 వేల కోట్ల రైతు రుణాలను మాఫీచేసేయాలని డిసైడ్ చేశారు. డిసైడ్ చేయటం ఒక నిముషంలోని పని. అయితే అందుకు డబ్బులుండద్దా ? ఆ డబ్బుల కోసమే ఆదాయార్జన శాఖలను పట్టుకుని పిండేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎక్సైజ్ శాఖ మీద కూడా కేసీయార్ కన్నుపడింది. అందుకనే రెండునెలల ముందుగానే 2620 వైన్ షాపులకు నోటిఫికేషన్ జారీచేసింది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం బిడ్లు వేసేందుకు చాలా మండలాల్లో లిక్కర్ సిండికేట్లు ఏర్పాటైనట్లు సమాచారం. వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ ఏజెంబ్లను ముందుంచి రాజకీయ నేతలే తెరవెనుక ఉండి చక్రం తిప్పుతున్నారట. ఎందుకంటే రాబోయేదంతా ఎన్నికల సీజన్లే అని. మరో నాలుగు నెలల్లో షెడ్యూల్ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఆ తర్వాత తొమ్మిదినెలలకు పార్లమెంటు ఎన్నికలు వస్తాయి.
అవి అయిపోయిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఖాయం. మళ్ళీ ఎక్కడో చోట ఉపఎన్నికలు వచ్చాయంటే లిక్కర్ సిండికేట్ కు పండగే పండగ. దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జున సాగర్, మునుగోడు ఉపఎన్నికల్లో లిక్కర్ బిజినెస్ విపరీతంగా జరిగింది. అడ్వాన్స్ నోటిపికేషన్ పీజు, షాపుల వేలంపాటలు, తర్వాత ఫీజుల రూపంలో వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లకు సుమారు 17 వేల కోట్ల రూపాయలు సమకూరుతుందని అంచనా వేస్తోంది ప్రభుత్వం. నిజంగానే ప్రభుత్వం అంచనా ప్రకారం 17 వేల కోట్ల రాపాయలు వస్తే మిగిలిన రు. 10 వేల కోట్లను ఇతరత్రా మార్గాల్లో సేకరించి వెంటన రైతు రుణమాఫీ చేయాలన్నది కేసీయార్ ఆలోచన.
This post was last modified on August 13, 2023 11:40 am
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…