తన తండ్రి వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసిందంటూ పార్టీ నుంచి బయటకు వచ్చి. వైసీపీని స్థాపించారు జగన్. ఎంతో కష్టపడి గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ అంటే జగన్ కస్సున లేస్తారనే టాక్ ఉంది. కానీ ఇప్పుడు ఆ కాంగ్రెస్ కోసమే జగన్ ఫండింగ్ చేస్తున్నారంటా! దీనికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఉపయోగించుకుంటున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక ప్రభుత్వ కాంట్రాక్టులు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లేదా రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీకి దక్కుతాయని అంటుంటారు. ఇందులో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఏమో సీఎం జగన్, అవినాష్ రెడ్డి కుటుంబానికి చెందింది. ఇక రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ ఏమో తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిది.
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి జగన్ నమ్మిన బంటుగా పేరుందని అందరూ చెబుతుంటారు. ఇటీవల పొంగులేటి బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకునే ముందు జగన్‌ను నాలుగైదు సార్లు పొంగులేటి కలిశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత కూడా కలిశారని తెలిసింది. జగన్ ప్రభుత్వం కూడా పొంగులేటికి పెద్దఎత్తున కాంట్రాక్టులు అప్పగిస్తుందనే వాదన ఉంది. తాజాగా భూగర్భ విద్యుత్ లైన్ కాంట్రాక్టు కూడా పొంగులేటి కంపెనీకే ఇచ్చారని తెలిసింది.
ఇలా పొంగులేటిని పిలిచి మరీ కాంట్రాక్టులు ఇవ్వడం వెనుక జగన్ వ్యూహం దాగి ఉందని నిపుణులు భావిస్తున్నారు. పొంగులేటి ద్వారా కాంగ్రెస్కు జగన్ ఫండింగ్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలో గెలిచి జోరుమీదున్న కాంగ్రెస్‌కు.. తెలంగాణలోనూ సానుకూల పరిస్థితులున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్రంలోనూ ఈ సారి కాంగ్రెస్ ప్రధాన భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమి కూడా క్రమంగా పుంజుకుంటోంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా కాంగ్రెస్ నుంచి తనకు ప్రమాదం లేకుండా చేసుకోవడం కోసమే జగన్ ఇదంతా చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.
This post was last modified on August 11, 2023 3:00 pm
భారత దేశానికి శత్రుదేశాలపై యుద్ధాలు కొత్తకాదు.. ఉగ్రవాదులపై దాడులు కూడా కొత్తకాదు. కానీ.. అందరినీ ఏకం చేయడంలోనూ.. అందరినీ ఒకే…
అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే అల్లు అర్జున్ 22 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. స్క్రిప్ట్ లాక్ చేసిన టీమ్ ప్రస్తుతం…
ఇన్నేళ్లు సమంతను ఒక కథానాయికగానే చూశాం. కానీ ఇప్పుడు ఆమెను నిర్మాతగా చూస్తున్నాం. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన తొలి చిత్రం…
ఓర్పు-సహనం.. అనేవి ఎంతో కష్టం. ఒక విషయం నుంచి.. ప్రజల ద్వారా మెప్పు పొందాలన్నా.. అదేసమయంలో వస్తున్న విమర్శల నుంచి…
సుమారు 1000 కోట్ల రూపాయల వరకు ప్రకృతి సంపదను దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్న ఓబులాపురం మైనింగ్ కేసులో ప్రధాన దోషులు..…
దాయాది దేశం పాకిస్థాన్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. వాస్తవానికి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. తమపై భారత్ కత్తి దూస్తుందని పాక్…