ప్రభుత్వం అభివృద్ధిపై ఫోకస్ చేయాలని, పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీపై విమర్శలు చేయడం మానుకోవాలని మెగాస్టార్ చిరంజీవి ఏపీ లోని వైసీపీ నేతలను ఉద్దేశించి పరోక్షంగా చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలితోపాటు, మంత్రి గుడివాడ అమర్నాథ్, మంత్రి బొత్స, ఎంపీ నందిగం సురేష్ తదితరులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముందుగా తమ్ముడు పవన్ కళ్యాణ్ కు చిరంజీవి జ్ఞానబోధ చేయాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు.
చిరంజీవి అంటే తనకు గౌరవం ఉందని, కానీ సినిమాలను రాజకీయాల్లోకి లాగొద్దు అన్నట్టుగా చిరంజీవి మాట్లాడారని అన్నారు. అయితే, ఆ గొడవ మొదలుబెట్టింది పవన్ అని చిరంజీవి తెలుసుకోవాలని గుర్తు చేశారు. దాడికి ప్రతిదాడి చేస్తే బాధపడుతున్నారని విమర్శించారు. బ్రో సినిమాలో అంబటి పాత్రను సృష్టించింది ఎవరని? ఏది పడితే అది మాట్లాడడం సరికాదని అన్నారు. సినిమాలను పిచ్చుక అంటూ ఇండస్ట్రీని తక్కువ చేయడం ఏంటని అమర్నాథ్ ప్రశ్నించారు.
తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలని చిరంజీవికి అంబటి రాంబాబు సూచించారు. బ్రో సినిమాలో తన క్యారెక్టర్ పెట్టారా లేదా చిరంజీవి చెప్పాలని నిలదీశారు. చిరంజీవి అంటే తనకు గౌరవం ఉందని ఆయన ఏం మాట్లాడారో చూసి రేపు మళ్లీ మాట్లాడుతానని అన్నారు. చిరంజీవి వ్యాఖ్యలపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కూడా స్పందించారు. ఈ గొడవను మొదలుపెట్టింది మీ తమ్ముడు అని, బురద రాజకీయాలు మానుకోవాలని తమ్ముడికి హితవు చెప్పాలని సురేష్ అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎలా తేవాలో తాము చూసుకుంటామని చెప్పారు. సినిమా పరిశ్రమను పిచ్చుక అంటూ చిరంజీవి ఏ ఉద్దేశంతో మాట్లాడారో తనకు తెలియదని బొత్స అన్నారు. చిరంజీవి ఆ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
This post was last modified on August 9, 2023 12:59 pm
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ను భారత్ 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంలో హైదరాబాద్ యువ క్రికెటర్…