టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెచ్చిపోయారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మాచర్లలో లోకేష్ మాట్లాడుతూ.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నాలుగు సార్లు గెలిచించారని, కానీ ఇక్కడ అభివృద్ధి నిల్, అవినీతి ఫుల్‌గా ఉందన్నారు. గ్రానైట్ లారీల నుంచి మామూళ్లు, పక్క రాష్ట్రాల్లో మద్యం అమ్మకాల ద్వారా పిన్నెల్లి సోదరులు రూ.కోట్లు సంపాదించారని లోకేష్ విమర్శించారు. పిన్నెల్లి సోదరులను పిల్లి బ్రదర్స్ అని లోకేష్ ఎద్దేవా చేశారు. గుట్కా, మట్కా, పేకాట గ్యాంగులను నడిపిస్తున్నారని ఆరోపించారు.
ఇప్పుడు లోకేష్ వ్యాఖ్యలపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తీవ్ర స్థాయిలో చెలరేగారు.లోకేష్ నిజంగా చంద్రబాబుకే పుట్టి ఉంటే, మగాడు అయి ఉంటే తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.వెయ్యి కోట్ల అవినీతి అని అనడం కాదు, నిరూపించాలంటూ సవాల్ విసిరారు. మీ అయ్య వల్లే కాలేదు ఇక నువ్వు ఏం చేస్తావంటూ రామకృష్ణారెడ్డి ఫైరయ్యారు.
లోకేష్‌ను త్వరలోనే ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చేరుస్తారని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. లోకేష్ పువ్వు కాదు.. వెర్రి పువ్వు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి రాజకీయ అనుభవం అంత కూడా లోకేష్ జీవితం లేదని, అలాంటిది పెద్దిరెడ్డిని విమర్శిస్తావా అంటూ ఊగిపోయారు. వచ్చే ఎన్నికల్లో వార్డు మెంబర్‌గా కూడా లోకేష్‌ను గెలవనీయమని ఎమ్మెల్యే అన్నారు. పల్నాడు జిల్లాలో ఏడుకు ఏడు నియోజకవర్గాలు గెలుస్తామని రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
This post was last modified on August 8, 2023 9:19 pm
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి దర్శకుడికీ ఆశ ఉంటుంది. కానీ ఆ కల…
రాష్ట్ర విభజనతో అసలే అప్పులతో ప్రస్థానం మొదలుపెట్టిన నవ్యాంధ్రను గత వైసీపీ ప్రభుత్వం మరింత అప్పుల్లో కూరుకు పోయేలా చేసింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…
మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…
హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…