రాబోయే ఎన్నికల్లో తెలంగాణా కాంగ్రెస్ అభ్యర్ధుల ప్రచారాన్ని వ్యూహాత్మకంగా చేయాలని డిసైడ్ అయ్యింది. మామూలుగా అయితే ఏ పార్టీ అయినా ఎన్నికల ప్రచారాన్ని మ్యానిఫెస్టో ఆధారంగానే చేసుకుంటుంది. నియోజకవర్గాల్లో అభ్యర్ధులైనా, రాష్ట్రస్ధాయి ప్రచారమైనా ఒకే విధంగా జరుగుతుంది. అయితే వచ్చేఎన్నికల్లో పద్దతిని మార్చాలని డిసైడ్ అయ్యింది. ఎలాగంటే ‘లోకల్ ఇష్యూస్ ఫస్ట్..ఓవరాల్ అండ్ కామన్ ఇష్యూన్ నెక్ట్స్’ అన్న పద్దతిని అవలంభించబోతున్నది.
దీనికి ఉదాహరణ ఏమిటంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్ధి ప్రచారం చేసుకుంటున్నాడని అనుకుందాం. తన ప్రచారంలో అభ్యర్ధి సదరు నియోజకవర్గంలోని లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ను ప్రచారంలో ప్రస్తావిస్తారు. సమస్యలను ప్రస్తావించటమే కాదు దానికి పరిష్కారం కూడా సూచిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ సమస్యను ఎన్నిరోజుల్లో పరిష్కారు అనే విషయాన్ని కూడా ఎన్నికల ప్రచారంలో జనాలకు హామీ ఇవ్వబోతున్నారు. స్ధానిక సమస్యలను అభ్యర్ధి ప్రస్తావిస్తున్నారు, దాని పరిష్కారాన్ని సూచించటమే కాకుండా ఎన్నిరోజుల్లో పరిష్కరిస్తారనే విషయమై హామీ కూడా ఇస్తున్నారు కదా.
అంటే సమస్య పరిష్కారం పట్ల అభ్యర్ధికి చిత్తశుద్ది ఉందన్న విషయం జనాలకు అర్ధమవుతోంది. అలాగే అభ్యర్ధి ప్రచారంతో కనెక్టవుతారు. కాబట్టి కాంగ్రెస్ కు ఓట్లేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పార్టీ అగ్రనేతలు నిర్ణయించారు. అందుకనే లోకల్ ఇష్యూస్ కు అభ్యర్ధులు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభావితం చేయగలిగిన ఇష్యూస్ కూడా ఏమన్నా ఉంటే వాటిని అభ్యర్ధితో పాటు పీసీసీ అధ్యక్షుడు, పీసీసీ ఎన్నికల ప్రచార కమిటి, రాష్ట్రస్ధాయి నేతలు ప్రస్తావిస్తారు.
దీనికి ఉదాహరణ ఖమ్మం జిల్లాలోని కాటన్, మిర్చి మార్కెట్. ఉండటానికి ఈ మార్కెట్లు ఖమ్మంలోనే ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రభావితం చేస్తుంది. ఇలాంటి సమస్యలన్నింటినీ నియోజకవర్గాల్లో సిద్ధంచేసి జిల్లా కాంగ్రెస్ కమిటీలను క్రాస్ చెక్ చేసుకుని పీసీసీ ప్రచార కమిటికి వెంటనే ఇవ్వమని పీసీసీ అధ్యక్షుడు అన్ని నియోజకవర్గాల్లోని ఇన్చార్జిలు, సిట్టింగ్ ఎంఎల్ఏలను ఇప్పటికే ఆదేశించారు. దీని ఆధారంగా మ్యానిఫెస్టో తయారుచేయటం కూడా తేలికవుతుందని, ప్రచారం కొత్తపద్దతిలో చేసినట్లవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. మరి వీళ్ళ వ్యూహం ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాలి.
This post was last modified on August 8, 2023 12:37 pm
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…