Political News

ఎన్ని అనే దాని మీద క్లారిటీ ఇస్తాం: నాదెండ్ల మనోహర్‌!

రానున్న ఎన్నికల్లో ఎక్కడ నుంచి ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాం అనే దాని గురించి త్వరలోనే క్లారిటీ ఇస్తామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆయన గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు నాదెండ్ల మనోహర్. జనసేన అభ్యర్థిగా తెనాలి నుంచి నేను పోటీ చేస్తానని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం ధాటికి సామాన్యులు చితికి పోతున్నారని విమర్శించారు.

రాష్ట్ర వ్యాప్తంగా జనసేనని బలోపేతం చేసే దిశగా కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నాని నాదెండ్ల తెలిపారు. వారాహి యాత్ర ప్రారంభం నుంచి నియోజకవర్గాల్లో సమస్యలపై పవన్ కళ్యాణ్ పూర్తి అవగాహన తెచ్చుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో వైపీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు నాదెండ్ల. ఇందులో భాగంగానే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో త్వరలోనే చెప్పేస్తామన్నారు. అలాగే తర్వలోనే బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తులపై క్లారిటీ వస్తుందని చెప్పారు.

ప్రజల వ్యక్తిగత సమాచారం హైరదాబాద్ లోని ప్రైవేటు సంస్థలకు ఏపీ ప్రభుత్వం పంపిస్తోందని నాదెండ్ల ఆరోపించారు. డేటా చోరిపై పవన్ కల్యాణ్ మాట్లాడుతుంటే వైసీపీ మంత్రులు, నేతలు తీవ్ర విమర్శలు చేశారు. కానీ కేంద్రమే డైరెక్ట్ గా ఈ విషయం చెప్పిందని అన్నారు. ఈ విషయంపై జనసేన ముందే చెప్పిందన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు నాదెండ్ల.

ఈ ఫైలింగ్, డిజిటల్ సిగ్నేచర్ల పేరుతో ముఖ్యమంత్రికి తెలియకుండా వందల ఫైళ్లు వెళ్లిపోవడం తప్పుకదా? అని మనోహర్ ప్రశ్నించారు. అలాగే వలంటీర్ వ్యవస్త తప్పు చేస్తే ఎవరిని అడగాలి? దీనికి ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుంటారా అని మనోహర్ నిలదీశారు. ఇదంతా చూస్తుంటే పారదర్శకత ఎక్కడ ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు నాదెండ్ల.

అలాగే సీఎంవోలో అక్రమాలు జరిగాయని సీఎం జగన్ ఒప్పుకుని చర్యలు తీసుకోవాలని కోరారు. టీటీడీ చైర్మన్ గా భూమన నియామకం వల్ల ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సర్పంచులను డమ్మీలుగా చేసి వలంటీర్లు పెత్తనం చెలాయిస్తున్నారని దుయ్యబట్టారు నాదెండ్ల మనోహర్.

This post was last modified on August 7, 2023 7:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ-2లో శివుడు ఎవరు?

‘అఖండ 2.. తాండవం’ బాక్సాఫీస్ దగ్గర తాండవం ఆడుతూ దూసుకెళ్తోంది. సినిమాకు మిక్స్డ్ రివ్యూలు, టాక్ వచ్చినప్పటికీ.. తొలి రోజు…

22 seconds ago

బోయపాటి లాజిక్కు.. బాలయ్య సూపర్ హీరో

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘అఖండ-2’కు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి…

26 minutes ago

ఆది పినిశెట్టి… ఇలా జరిగిందేంటి

టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా…

1 hour ago

మసక మసక ఎలా ఉంది

ఇప్పుడు పాడటం లేదు కానీ ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సంగీతంలో పాప్ మ్యూజిక్ అనే ఒరవడి తేవడంలో గాయని…

2 hours ago

11 సీట్లు ఎలా వచ్చాయన్నదానిపై కోటి సంతకాలు చేయించాలి

ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్‌లైన్‌ను మళ్లీ…

3 hours ago

రాజా సాబ్ సంగీతానికి అభిమానుల సూచనలు

సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…

3 hours ago