కేసీఆర్ మనవడు హిమాన్ష్ రావు అంటే తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. కేటీఆర్ తనయుడు హిమాన్ష్.. చాలా సందర్భాల్లో తాతతో కలిసి కనిపించారు. అంతే కాకుండా వ్యక్తిగతంగానూ వివిధ విషయాల్లో పత్రికల్లోకెక్కారు. ఇటీవల ఓ పాఠశాలను దత్తత తీసుకుని.. అక్కడ సౌకర్యాలు కల్పించిన హిమాన్ష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ పాఠశాల దుస్థితి చూస్తే బాధేసిందని, అందుకే దత్తత తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ విషయాన్ని తండ్రి, తాతకు చెప్పాలంటూ హిమాన్ష్‌ను ఉద్దేశిస్తూ విపక్షాలు వ్యాఖ్యలు చేశాయి.
ఈ విమర్శలు, వ్యాఖ్యలను పక్కనపెడితే తాజాగా హిమాన్ష్ రావు మరోసారి వార్తల్లోకెక్కారు. తాతను ఆదర్శంగా తీసుకుని.. తండ్రి బాటలో హిమాన్ష్ సాగుతున్నారా? రాజకీయాలపై ఆసక్తి పెంచుకుంటున్నారా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో హిమాన్ష్ కనిపించడమే అందుకు కారణం. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ఆయన.. శాసనసభకు వచ్చారు. ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చుని, కాసేపు సమావేశాలను ఆసక్తిగా తిలకించారు. సభ జరుగుతున్న తీరు.. అక్కడి నాయకుల మాట్లాడుతున్న విధానాన్ని చూశారు. కొద్దిసేపటి తర్వాత వెళ్లిపోయారు.
హిమాన్ష్ అసెంబ్లీలో కనిపించడంపై రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. భవిష్యత్ నాయకుడిగా ఎదిగే అవకాశమున్న హిమాన్ష్ రాజకీయ పాఠాల కోసం శాసనసభకు వచ్చారనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. హిమాన్ష్ కుటుంబంలో ఎటు చూసినా రాజకీయ నాయకులే. ఇలాంటి వాతావరణంలో పెరుగుతున్న ఆయనకు సహజంగానే పాలిటిక్స్ అంటే ఆసక్తి కలుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి భవిష్యత్‌లో కేసీఆర్ వారసత్వాన్ని హిమాన్ష్ కొనసాగిస్తారేమో చూడాలి.
This post was last modified on August 7, 2023 6:24 pm
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని కావేరి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…