Political News

పోలీసులూ.. ఖ‌బ‌డ్దార్‌.. మీపై ప్రైవేటు కేసులు వేస్తాం: చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. చిత్తూరు జిల్లా పోలీసుల‌పై తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు. పోలీసులూ ఖ‌బ‌డ్దార్‌! అంటూ ఆయ‌న హెచ్చ‌రించారు. టీడీపీ నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెడితే.. కోర్టులో మీపై ప్రైవేటు కేసులు దాఖ‌లు చేయాల్సి ఉంటుంద‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. ఇటీవల పుంగనూరు-తంబళ్లపల్లేల్లో జ‌రిగిన దాడుల నేప‌థ్యంలో ఇప్ప‌టికే 60 మంది టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

అయితే.. 100 మందికిపైగా కార్య‌క‌ర్త‌ల జాడ క‌నిపించ‌డం లేద‌ని పార్టీ కార్య‌క‌ర్త‌లు తెలిపారు. ప్ర‌స్తుతం ఏలూరు జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న చంద్ర‌బాబు వ‌ద్ద‌కు ఈ రోజు ఉద‌యం వ‌చ్చిన చిత్తూరు నాయ‌కులు.. జిల్లాలో జ‌రుగుతున్న కేసుల న‌మోదు.. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల నిర్బంధంపై చంద్ర‌బాబుకు వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల ఆవేద‌న విని చ‌లించిపోయిన చంద్ర‌బాబు పోలీసుల‌ను ఉద్దేశించి నిప్పులు చెరిగారు.

పోలీసులు అర్థరహితంగా కేసులు పెడుతున్నారంటే.. వారి అన‌ర్థాన్ని వారే కొనితెచ్చుకుంటున్నార‌ని అర్థం చేసుకోవాలన్నారు. అక్ర‌మ కేసుల‌పై కోర్టుల్లో న్యాయ‌పోరాటం చేస్తామ‌న్నారు. మారణాయుధాలతో వచ్చారని, కేసులు పెట్టారంటూ కేసులు పెడ‌తారా? అని పోలీసుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాధ్ రెడ్డి, ఘంటా నరహరి, శ్రీరాం చినబాబులపై హత్యయత్నం కేసులు నమోదు చేయ‌డాన్ని ఆయ‌న ఖండించారు. పోలీసులు ప‌ద్ధ‌తి మార్చుకుని, రాజ్యాంగం ప్ర‌కారం.. చ‌ట్టం ప్ర‌కారం వ్య‌వ‌హ‌రించాల‌ని అన్నారు.

కాగా, పుంగనూరు ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్ప‌టి వ‌ర‌కు 5 ఎఫ్ఐఆర్లు, 200 మందిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే పోలీసుల అదుపులో 60 మంది టీడీపీ నేతలున్నారు. 24 గంటలకుపైగా పోలీసుల అదుపులో ఉన్నా.. కోర్టుకు హాజరు పర్చకపోవడంపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మ‌రోవైపు టీడీపీ నేతలను చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

This post was last modified on August 7, 2023 3:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

3 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

4 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

6 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

8 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

9 hours ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

9 hours ago