కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీకి భారీ ఊరట లభించింది. ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్దరిస్తూ పార్లమెంటులోని లోక్‌సభ సచివాలయం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. కీలకమైన పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాహుల్‌పై సస్పెన్షన్ ఎత్తేయడం.. కాంగ్రెస్ పార్టీకి కూడా బిగ్ రిలీఫ్ అనే చెప్పారు.
2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పక్షాన రాహుల్ గాంధీ ప్రచారం చేశారు. అయితే, ఈ సమయంలో ఆయన “మోడీ ఇంటి పేరు చిత్రంగా దొంగలకే ఉంటుంది ఎందుకో!” అని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్‌కు చెందిన బీజేపీ నాయకుడు ఒకరు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. అనంతర కాలంలో దీనిపై పెద్దగా దృష్టి పెట్టని పోలీసులు.. ఈ ఏడాది ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ దూకుడు పెంచిన తర్వాత.. కేసు విచారణను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు.
ఈ క్రమంలోనే సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్షతోపాటు 25 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. అయితే ఆవెంటనే ఆయన బెయిల్ పిటిషన్ పెట్టుకోవడంతో దానిని అనుమతించారు. ఇక, దీనిపై అలహాబాద్ హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేసినా ఫలించలేదు. ఇంతలో హుటాహుటిన పార్లమెంటు లోక్‌సభ స్పీకర్ రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష పడిన నేపథ్యంలో ఆయనను అనర్హుడిగా ప్రకటించారు. దీంతో పార్లమెంటు సభ్యత్వం కోల్పోయారు.
గత 2019 ఎన్నికల్లో రాహుల్ కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు. ఇక, ఇటీవల సుప్రీం కోర్టులో ఈ కేసును విచారించిన ధర్మాసనం.. రాహుల్ శిక్షపై స్టే విధించింది. దీంతో పార్లమెంటు తాజాగా ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తేసింది. ఇదిలావుంటే.. పార్లమెంటులో మణిపూర్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో రాహుల్‌గాంధీ సభ్యత్వం పునరుద్ధరించడం కాంగ్రెస్‌కు అతి పెద్ద రిలీఫ్‌గానే భావించాలి.
This post was last modified on August 7, 2023 1:12 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్‌ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…