ఒక్క వివాదం.. ఒకే ఒక్క వివాదం.. వైసీపీ ఎమ్మెల్యే గ్రాఫ్‌ను ఢమాల్ మని పడేసిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం వినుకొండలో కొన్ని రోజుల కిందట.. టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మధ్య తీవ్ర వివాదం తెరమీదికి వచ్చిన విషయం తెలిసిందే. టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర 2000 కిలో మీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వినుకొండలో సంఘీభావ పాదయాత్ర చేపట్టారు.
ఈ క్రమంలో వైసీపీ నేతలు.. కవ్వింపు చర్యలకు దిగారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఇది పెను వివాదంగా మారి.. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, టీడీపీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మధ్య తీవ్ర వివాదం రేగింది. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపే వరకు కూడా ఈ వివాదం కొనసాగింది. అయితే.. మొత్తానికి రెండు మూడు రోజుల పాటు ఉద్రిక్తతలు కొనసాగాయి. తర్వాత.. కొంత ఈ వివాదం తెరిపిచ్చింది.
అయితే.. ఈ ఘర్షణ కారణం.. వైసీపీ ఎమ్మెల్యే తన గ్రాఫ్ పెరుగుతుందని.. తన సత్తా పెరుగుతుందని భావించి ఉంటారని పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి ఇప్పుడు ఎమ్మెల్యే వ్యవహారంపై ప్రజల్లో అసంతృప్తి రేగిందని అంటున్నారు. ఎందుకంటే.. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు బొల్లా సహా వైసీపీ నాయకులు అనేక కార్యక్రమాలు చేపట్టారు . అప్పుడు వినుకొండలో ఒక్క వివాదం కానీ.. పోలీసులు కాల్పలకు దిగడం కానీ.. జరగలేదని ఇక్కడి వారు చెబుతున్నారు.
కానీ, ఇప్పుడు ప్రశాంతమైన వినుకొండ అశాంతికి నెలవుగా మారడం వెనుక కక్ష పూరిత రాజకీయాలు ఉన్నాయని ఇక్కడి ప్రజలు భావిస్తున్నట్టు పరిశీలకులు చెబుతున్నారు. ఇదే విషయంపై కొన్ని ఆన్‌లైన్ చానెళ్లు ముఖ్యంగాబొల్లాకు అనుకూలంగా ఉన్న చానెళ్లు సర్వే చేయగా.. తమకు ప్రశాంతత కావాలని.. కొట్టుకునే నాయకులు తమకు అవసరం లేదని ప్రజలు తేల్చి చెప్పారట. అంతేకాదు.. ఎమ్మెల్యే బాధ్యతగా వ్యవహరించాలని ఎక్కువ మంది సూచించినట్టు సమాచారం. మొత్తంగా చూస్తే.. బొల్లా దూకుడుతో ఆయన గ్రాఫ్ పడిపోయిందని మెజారిటీ వర్గాలు చెబుతున్నాయి.
This post was last modified on August 7, 2023 9:19 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…