తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ (టీటీడీ) కొత్త ఛైర్మన్‌గా ఎవరిని ఎంపిక చేయబోతున్నారు అన్న విషయంపై చాలాకాలంగా సందిగ్దత ఏర్పడిన సంగతి తెలిసిందే. మరో వారం రోజుల్లో టీటీడీ ప్రస్తుత ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి ఆ పదవి దక్కనుందని ప్రచారం జరిగింది. ఇక, జంగాతో పాటు మరికొందరు నేతల పేర్లు కూడా వినిపించాయి. అయితే, చివరకు తిరుపతి ఎమ్మెల్యే , వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ నూతన చైర్మన్ గా నియమించారు సీఎం జగన్.
అయితే, భూమన టీటీడీ ఛైర్మన్ గా చేయడం ఇది తొలిసారి కాదు.2006-08లో ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒకసారి టీటీడీ ఛైర్మన్‌గా భూమన పని చేశారు. భూమన పదవిలో ఉన్నపుడే దళిత గోవిందం వంటి పథకాలను టీటీడీ ప్రవేశపెట్టింది. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా పేరున్న భూమన 2019 ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, రాబోయే ఎన్నికల్లో తిరుపతి టికెట్‌ను తనయుడు అభినయ్ రెడ్డికి కేటాయించాలని జగన్ ను భూమన కోరుతున్నారు. తాజాగా భూమనను టీటీడీ ఛైర్మన్‌గా నియమించడంతో అభినయ్ రెడ్డికి లైన్ క్లియర్ అయినట్లేనని తెలుస్తోంది. భూమన..ఒక దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్లేనని టాక్ వస్తోంది.
This post was last modified on August 5, 2023 6:03 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…