శుక్రవారం ఉదయం చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగిన ఘటన పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో సుమారు 30 మంది టీడీపీ నేతలు, కార్యకర్తల పై కేసు నమోదు చేయగా..ఎవరినీ అదుపులోనికి మాత్రం తీసుకోలేదు. వారి పై ఐపీసీ 147,332, 353, 128 బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు వివరించారు.
టీడీపీ కార్యకర్తల దాడిలో పోలీసులు గాయపడ్డారు, పోలీసు వారి వాహనాలకు సైతం ఉద్దేశ పూర్వకంగానే నిప్పు పెట్టారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో రాళ్లు రువ్విన, నిప్పు పెట్టిన వారందరినీ గుర్తించామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన అందరిపై కఠినమైన శిక్షలు అమలు చేస్తామని వెల్లడించారు డీజీపీ.
ఈ ఘటన గురించి వెంటనే విచారణ చేపట్టాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి….డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్ లను ఆదేశించారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నామని, ఇప్పటికే అనేకమందిని గుర్తించామని, మరికొందరి కదలికలపై కూడా నిఘా పెట్టామన్నారు. చంద్రబాబు రూట్ ప్లాన్ మార్పు వ్యవహారం కూడా విచారణలో తేలుతుందని, ఈ ఘటన వెనుక ఎవరున్నారో ప్రాథమిక సమాచారం ఉందని తెలిపారు. లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.
డీఐజీ అమ్మిరెడ్డి మాట్లాడుతూ.. పుంగనూరులో టీడీపీ నేతల దాడిలో గాయపడిన పోలీసులను మెరుగైన చికిత్స నిమిత్తం రాత్రి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. నాయకులు పార్టీ సిద్ధాంతాలపై వ్యాఖ్యానించాలని.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాట్లాడకూడదన్నారు. వీఐపీ వచ్చే కొద్ది సమయంలోనే టౌన్ లోకి తీసుకొస్తామని ప్రొరోక్ చేశారన్నారు. ఉద్దేశ పూర్వకంగానే రాళ్లతో దాడి చేశారన్నారు. తెలుగుదేశం శ్రేణుల దాడిలో 13 మంది పోలీసులకు గాయాలయ్యాయన్నారు. దాడి చేసిన వారిపై చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు డీఐజీ.
కాగా శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు పుంగనూరు పర్యటన రసాభాసాగా మారింది. పుంగనూరుకు చంద్రబాబు రావొద్దంటూ పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నల్లజెండాలను, నల్ల బెలూన్లను ఎగురవేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం రాళ్లతో ఇరు వర్గాలు దాడికి దిగారు. ఈ క్రమంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
అయితే టీడీపీ కార్యకర్తలే రాళ్లు విసిరారని పోలీసులు చెబుతున్నారు. కొందరు తెలుగుదేశం పార్టీ శ్రేణులు రెచ్చిపోయి పోలీసుల వాహనాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారన్నారు. ముందుగానే అనుకుని పక్కా ప్లాన్ ప్రకారం దాడికి తెగబడినట్లు చెబుతున్నారు. వాస్తవానికి చంద్రబాబు బైపాస్ మీదుగా వెళతారని రూట్ మ్యాప్ ఇచ్చారని.. కానీ ఆ తర్వాత ఉన్నట్టుండి ప్లాన్ మార్చి పుంగనూరులోకి వచ్చేందుకు ప్రయత్నించారని పోలీసులు వెల్లడిస్తున్నారు.
This post was last modified on August 5, 2023 3:00 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…