ఏ పార్టీకైనా విజయం అందాలంటే.. అంత ఈజీ అయితే కాదు. ముందు పార్టీని సంస్కరించుకోవాలి. తర్వాత నేతలను లైన్‌లో పెట్టుకోవాలి. అనంతరం.. తాము ఎంచుకున్న అజెండాను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. ఈ మూడు విషయాలను పక్కాగా నిర్వహిస్తే తప్ప.. ఏ పార్టీకైనా.. విజయం దక్కించుకోవడం అంత తేలిక కాదనే వాదన బలంగా వినిపిస్తూనే ఉంటుంది.
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విషయానికి వస్తే.. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని తీరాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. పార్టీ అధినేత చంద్రబాబు చేసిన బీషణ ప్రతిజ్ఞతో పాటు.. పార్టీ కేడర్‌ను కాపాడుకు నేందుకు కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అధినేత గుర్తించారు. ఈ క్ర మంలోనే చంద్రబాబు ఇప్పటికీ ప్రజల్లోకి వస్తున్నారు. తాను చేయాలని అనుకున్న పనులు చేస్తున్నారు.
ప్రజల్లో ప్రసంగాలు గుప్పిస్తున్నారు. మేనిఫెస్టో అంటూ.. ఇటీవల మహానాడులో మహిళా శక్తి.. సహా ఇతర పథకాలు ప్రకటించారు. మొత్తంగా పార్టీ అధిష్టానం పరంగా చర్యలు.. దూకుడు బాగానే ఉంది. ఇక, ఇప్పు డు కావాల్సింది.. ఏంటి? ఏ మైనస్‌లు ఉన్నాయి? పార్టీని ఎలా ముందుకు నడిపిస్తే.. విజయం ఖాయమ వుతుంది? వంటి కీలక అంశాలు చర్చకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆ మైనస్‌లను చెరిపేస్తే.. పార్టీ పరంగా దూకుడు పెరుగుతుందని అంటున్నారు పరిశీలకులు.
1) పార్టీ నేతల్లో ఉన్న టికెట్ల కలవరాలు. 2) పొత్తులపై క్లారిటీ 3) వచ్చే ఎన్నికల్లో ఇచ్చే ప్రధాన హామీలు.. 4) సీట్ల కేటాయింపు 5) వారసుల కు హామీలు. ఈ విషయంలో చంద్రబాబు నాన్చుడు ధోరణి అవలంభిస్తు న్నారనేది మెజారిటీ తమ్ముళ్ల మాట. ఈ క్రమంలోనే వారు ఎన్నికల సమయానికి ఈ సందేహాలు క్లియర్ అవుతాయని.. అప్పటి వరకు వేచి చూడొచ్చని అనుకుంటున్నారు. కాబట్టి ఈమైనస్‌ల విషయంలో చంద్రబాబు సాధ్యమైనంత వరకు క్లారిటీ ఇస్తే విజయం తమదేనని చెబుతున్నారు.
This post was last modified on August 5, 2023 2:57 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…