Political News

రాహుల్‌కు ఊర‌ట‌.. రెండేళ్ల శిక్ష‌పై స్టే.. త‌ర్వాత ఏంటి?

కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు, గాంధీల వార‌సుడు.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది. గుజ‌రాత్‌లోని స్థానిక సూర‌త్ కోర్టు ఆయ‌న‌కు విధించిన రెండేళ్ల జైలు శిక్ష‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. అంతేకాదు.. రెండేళ్ల‌పాటు.. ఆయ‌న‌ను విచారించేందుకు కూడా అనుమ‌తులు తీసుకోవాల‌ని(వేరే కేసుల్లో) కూడా సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు సంతోషం వెల్లివిరుస్తోంది.

ఏం జ‌రిగింది?

2018లో జ‌రిగిన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌చారానికి వ‌చ్చిన రాహుల్‌గాంధీ.. ప్ర‌ధాన న‌రేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ.. “దేశంలోని ఘ‌రానా దొంగ‌లంద‌రి ఇంటి పేర్లూ.. మోడీ అనే ఉంటుంది చిత్రంగా!” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌పై త‌దుప‌రి సంవ‌త్స‌రం.. గుజ‌రాత్‌లో ఒక వ్య‌క్తి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌ర్వాత ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కేసును సుదీర్ఘ‌కాలం విచారించిన కోర్టు.. ఈ ఏడాది మార్చిలో రాహుల్‌ను దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

అయితే.. ఆవెంట‌నే రాహుల్ బెయిల్ పిటిష‌న్ వేసుకోవ‌డం.. ఆయ‌న‌కు బెయిల్ కూడా రావ‌డం తెలిసిందే. ఇదిలావుంటే .. పార్ల‌మెంటు ప్ర‌జాప్రాతినిధ్య చ‌ట్టం ప్ర‌కారం. రెండేళ్ల జైలు శిక్ష ప‌డిన వారిని అన‌ర్హుల‌ను చేయాల‌నే నియమంతో రాహుల్‌పైనా వేటు వేసింది. దీంతో కొడైనాడ్‌(కేర‌ళ‌) నుంచి గెలిచిన రాహుల్‌.. స‌స్పెండ్ అయ్యారు. ఇక‌, ఈ కేసును ఆయ‌న సుప్రీంలో స‌వాల్ చేసి.. శిక్షపై స్టే కోరారు. దీనికి సుప్రీంకోర్టు అంగీక‌రించింది.

మ‌రి త‌ర్వాత‌.. ఏం జ‌రుగుతుంది? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఇప్పుడు పార్ల‌మెంటులో త‌న గ‌ళం వినిపించాల‌నేది రాహుల్ ఉద్దేశం. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌కు ఉన్న శిక్ష అడ్డంకి పాక్షికంగా తొలిగింది. మ‌రి స్పీక‌ర్ ఆయ‌న‌పై విధించిన స‌స్పెన్ష‌న్‌ను తొల‌గిస్తారో లేదో చూడాలి.

This post was last modified on August 4, 2023 2:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

11 minutes ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

2 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

2 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

3 hours ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

6 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

7 hours ago