టీడీపీలో టికెట్ ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు గుర్రం ఎక్కుతుందనే అంచనాలు వస్తున్న నేపథ్యంలో పార్టీలో చేరేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో పార్టీలో చేరు తున్నా.. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కుతుందా? అనేది డౌటే. అదేసమయంలో ప్రస్తుతం ఉన్న నాయకులకు కూడా టికెట్లు అందరికీ ఇస్తారా? అంటే.. డౌటే.. ఎందుకంటే.. వారి పనితీరు, వారి గ్రాఫ్ వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నారు.
అయితే.. గ్రాఫ్ ఎలా ఉన్నా.. తమకు ప్రజాదరణ ఎలా ఉన్నా పార్టీలో కీలక నాయకులను పట్టుకుంటే టికె ట్ ఖాయమని భావిస్తున్నవారు యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ చుట్టూ.. మూగుతున్నారు. ఆయనను కలిసి.. మచ్చిక చేసుకుని టికెట్ల విషయంపై ఆయనను బ్రతిమాలుతున్న పరిస్థితి కనిపిస్తోం దని పార్టీలో గుసగుస వినిపిస్తోంది. ఎలాగంటే.. ఉదయాన్నే పాదయాత్ర సమయంలో నారా లోకేష్ సెల్ఫీ కార్యక్రమం ప్రారంభిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ముందుగానే స్థానిక నాయకులతో పాటు..కొందరు దూర ప్రాంత నాయకులు కూడా నారా లోకేష్‌ను కలుసుని.. తమ మనసులోని మాటలు చెబుతూ.. కాకాపడుతున్నారట. దీంతో నారా లోకేష్ ఎవరికి ఏం హామీ ఇవ్వాలో తెలియక.. తర్వాత.. చూద్దాం.. తర్వాత. చూద్దాం! అని సాగనంపుతున్నారు. అయితే.. ఇప్పుడు ఈ విషయంపై చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారని ఎన్టీఆర్ భవన్ వర్గాలు చెబుతున్నాయి.
యువగళం అనేది పాదయాత్ర మాత్రమేనని.. టికెట్ల యాత్ర కాదని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అంతేకాదు.. ఎవరైనా వచ్చి.. టికెట్ల కోసం.. నారాలోకేష్‌ను అభ్యర్థించినా.. ఆయనపై మానసికంగా ఒత్తిడి చేసినా.. అలాంటివారిని ఇప్పటి నుంచే పక్కన పెడతామని.. అంతర్గతంగా మెసేజ్ పంపించారని అంటున్నారు. అభ్యర్థి సీనియరా? జూనియరా? అనే విషయంతో సంబంధంలేకుండా.. ప్రజల్లో ఉంటున్నారా? గ్రాఫ్ ఎలా ఉంది? గెలుస్తారా? అన్న కోణంలోనే ఆలోచించి టికెట్‌పై నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. ఇదీ.. సంగతి!
This post was last modified on August 4, 2023 12:21 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…