తెలంగాణలో ఎన్నికలకు మరో నాలుగు మాసాల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో అధికార పార్టీ బీఆర్ ఎస్‌ను ఓడించి.. గద్దెనెక్కాలని.. పాలన ప్రారంభించాలని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. అయితే.. వీరిలో కలయిక.. ఐక్య పోరాటాలు.. వంటివి ఎలా.. ఉన్నా.. కేసీఆర్‌కు ఉన్న వ్యతిరేకత, రెండు సార్లు పాలించారన్న వాదన.. వంటివి ఈ పార్టీలకు దన్నుగా మారుతున్నాయనే చర్చ సాగుతోంది.
ఇదేసమయంలో కేసీఆర్‌కు గత ఎన్నికల్లో అంటే 2014లో తెలంగాణను తానే తెచ్చానన్న సెంటిమెంటు ఉపయోగపడింది. ఇక, 2018లో టీడీపీ తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వడం ఆయనకు కలిసి వచ్చింది. ఇక, ఇప్పుడు అంటే.. 2023 నవంబరు-డిసెంబరు మధ్య జరగనున్న ఎన్నికల్లో ఇప్పటికైతే.. ఏదీ ఆయనకు పెద్దగా అందివచ్చిన సెంటిమెంటు లేదు. దీంతో అభివృద్ధి తెలంగాణ అంటూ.. కొత్త పంథాను ఎంచుకున్నారు.
కానీ, ఇంతలోనే హఠాత్తుగా పెద్ద విషయం ఒకటి.. కేసీఆర్‌కు మేలు చేసేలా.. ఎన్నికల గోదాలో నుంచి కారును సునాయాశంగా బయటకు వచ్చేలా చేసే ఒక సంచలన నిర్ణయాన్ని కేంద్రంలోని మోడీ సర్కారు ప్రకటించారు. ఇది అలాంటి ఇలాంటి సెంటిమెంటు కాదనే చర్చ సాగుతుండడం గమనార్హం. విషయం ఏంటంటే.. ఉమ్మడి ఏపీ విడిపోయాక.. కొన్నాళ్ల పాటు తెలంగాణకు ఏపీ నుంచి విద్యుత్ సరఫరా అయింది. దీనికి సంబందించి.. తెలంగాణ సర్కారు ఏపీకి బిల్లు కట్టాలి.
అయితే.. మొదట్లో బాగానే కట్టినా.. తర్వాత కట్టడం మానేసింది. ఇది 6,720 కోట్ల రూపాయలకు చేరుకుం ది. ఈ సొమ్ము విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కోర్టుకు వెల్లింది. దీంతో ఈ విషయంపై కోర్టు స్టే విధించింది. కేంద్రాన్ని పరిశీలించాలని ఒకసారి.. రెండు తెలుగు రాష్ట్రాలు చర్చించుకుని పరి ష్కరించుకోవాలని మరోసారి ఇలా.. తేల్చి చెప్పింది. ఇంతలో ఈ విషయాన్ని పరిష్కరించేందుకు కేంద్రంలోని మోడీ సర్కారు రంగంలోకి దిగింది.
తెలంగాణ ప్రభుత్వానికి రిజర్వ్‌బ్యాంకులో ఉన్న నిధులను.. ఆ ప్రభుత్వంతో సంప్రదించకుండానే (అంటే.. కేసీఆర్‌ను అడగకుండానే.. ఈ పాయింటే కీలకం) ఏపీకి నేరుగా ఇచ్చేసేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇదే విషయాన్ని పార్లమెంటుకు కూడా చెప్పింది. సో.. ఇది చాలదా.. కేసీఆర్ తనను తాను గెలిపించుకునేందుకు అంటున్నారు పరిశీలకులు.
ఇప్పుడు కేసీఆర్ ఏమంటడంటే?..
“అదిగో మన మీద కక్ష గట్టిన్రు.. మనకు సొమ్ములు ఇవ్వక పాయే.. ఆర్బీఐలో ఉన్న మన సొమ్ముపైనా.. బీజేపీ పెద్దలు పెత్తనం చేస్తున్రు. ఏపీకి మనం సొమ్ములు ఇవ్వాలంట. సరే.. ఆ పంచాయతీ ఏదో మేంమేం చూసుకోమా.. కానీ.. తెలంగాణపై పెత్తనం చేసేందుకు గిప్పుడు బీజేపీ సిద్ధమైంది. ఇప్పుడు మన ఆత్మాభిమానాన్ని.. మన ఆస్తులను మనమే కాపాడుకోవాలి.. దీనికి మనందరం నడుం బిగించాలి”- ఇంకేముంది.. సెంటిమెంటు ఓట్ల రూపంలో మారి.. బ్యాలెట్ బాక్సుల్లోకి చేరడం ఖాయం అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 4, 2023 12:06 pm
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…