అభిమానాన్ని చాటుకోవటానికి ఒక పద్దతంటూ ఉంటుంది. దాన్ని వదిలేసి.. ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ చేసే చేష్టలతో లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంటుంది. ఆ కోవలోకే వస్తుంది బాపట్లలోని ఉదంతం. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు.. పార్టీ నేతలు కలిసి చేపట్టిన కార్యక్రమం షాకింగ్ గా మారింది.
పట్టపగలు.. నడిరోడ్డు మీద.. స్టేజ్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ అంతరాయం కలిగినా పట్టించుకోకుండా గంటల తరబడి రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించిన వైనం ముక్కున వేలేసుకునేలా చేసింది. ఎమ్మెల్యే రఘుపతి జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు యువతుల చేత చేయించారు. ఈ రికార్డింగ్ డ్యాన్సుల వ్యవహారం చూస్తే.. బరితెగింపునకు సరికొత్త నిర్వచనం ఇచ్చేలా మారింది.
పట్టణంలో రద్దీగా ఉండే సూర్యలంక రోడ్డులో.. రోడ్డును సగం ఆక్రమించి కట్టేసిన స్టేజ్ మీద రికార్డింగ్ డ్యాన్సుల్ని ఏర్పాటు చేశారు. దీంతో.. జనం గుమిగూడటంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. ట్రాఫిక్ జాం కావటంతో ఇబ్బందులు రెట్టింపు అయ్యాయి. రికార్డింగ్ డ్యాన్సుల్ని నిర్వహిస్తూ.. మధ్యలో ఎమ్మెల్యేను తీసుకొచ్చి కేక్ కట్ చేయించటం గమనార్హం.
మరోవైపు ఎమ్మెల్యే పుట్టినరోజును పురస్కరించుకొని బాపట్ల పట్టణానికి సమీపంలో ఉండే పిన్నిబోయినపాలెం వైసీపీ నేతలు డీజే మైకులతో గ్రామం నుంచి బాపట్ల పట్టణంలోని ఎమ్మెల్యే ఇంటి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మధ్యలో టపాసుల్ని కాల్చగా.. ఒక పూరి గుడిసె మీద పడి మంటలు అంటుకున్నాయి. సమయానికి ఫైరింజన్ వచ్చి మంటలు ఆపేయటంతో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది.
పుట్టినరోజు వేడుకలు అంటే రక్తదాన శిబిరాల్ని నిర్వహించటమో.. పేదలకు సాయపడేలా కార్యక్రమాల్ని నిర్వహించటమో చేస్తారు కానీ.. ఇలా పట్టపగలు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ రోడ్డు మీద రికార్డింగ్ డ్యాన్సులు ఏంది? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులతో ప్రజల్లో అసహనానికి గురి చేసేలా చేస్తుందని.. ఈ చేష్టలతో మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గుర్తించాలన్న సూచనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on August 4, 2023 11:54 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…