ఏపీలోని జగన్ సర్కారు చేస్తున్న అప్పుల మీద పెద్ద ఎత్తున చర్చ జరగటంతో.. ప్రధాన ప్రతిపక్షం చేసే విమర్శలకు అప్పుల విషయంలో కొత్త క్లారిటీ ఇచ్చారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్. తాజా వివరణలో ఆయన గణాంకాలతో సహా ఏపీ అప్పులు జగన్ ప్రభుత్వంలో ఎలా తగ్గాయన్న విషయాన్ని వివరించే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. ఏపీ అప్పుల మీద కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. కాగ్ చెప్పిన విషయాలన్ని వాస్తవాలే అన్న ఆయన.. జగన్ హయాంలో ఏపీ సంపద పెరిగి.. అప్పులు తగ్గినట్లుగా పేర్కొన్నారు. తన మాటకు గణాంకాలతో జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
రాష్ట్ర అప్పులు రూ.4.42 లక్షల కోట్లుగా కేంద్రం పేర్కొందని.. బడ్జెట్ బయట చూసినా.. లోపల చూసినా అప్పులు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎక్కువని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో పరిమితికి మించి చేసిన రూ.16,418 కోట్ల అప్పుల కారణంగా ఆ మేరకు తమ ప్రభుత్వంలో కేంద్రం ఇచ్చే అప్పులో కోత పడినట్లుగా పేర్కొన్నారు. తమకు అనుమతి ఉన్నా రూ.28,466 కోట్లు తక్కువగా అప్పులు చేసినట్లుగా పేర్కొన్నారు.
చంద్రబాబు ప్రభుత్వంలో అప్పుల వార్షిక వ్రద్ధి రేటు 14.7 శాతమైతే.. తమ ప్రభుత్వంలో మాత్రం 12.4 శాతమేనని.. అప్పులు చేసినా డీబీటీ రూపంలో ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా చేరవేశామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు ఎటువైపు వెళ్లినట్లు? అని ప్రశ్నించిన బుగ్గన.. టీడీపీ అధికారంలో ఉండగా సంపద పెరగకపోయినా.. అప్పులు పెరిగినట్లుగా మండిపడ్డారు.
2014-15 నాటికి రాష్ట్ర అప్పులు రూ.1.22 లక్షల కోట్లు కాగా 2018-19 నాటికి రాష్ట్ర అప్పులు రూ.2.64 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. 2023 నాటికి రాష్ట్ర అప్పులు రూ.4.42 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో అప్పులు ఏడు శాతానికి పెరిగితే.. తమ ప్రభుత్వంలో మాత్రం మూడుశాతం మాత్రమే పెరిగినట్లుగా చెప్పారు. బుగ్గన వాదనకు టీడీపీ తమ్ముళ్లు కౌంటర్లు వెతుక్కుంటున్నారు.
This post was last modified on %s = human-readable time difference 10:33 am
నిత్యం విరామం లేని పనులతో.. కలుసుకునే అతిథులతో బిజీబిజీగా ఉండే ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా టీ కాచారు. స్వయంగా…
తెలంగాణలోనూ తెలుగు దేశం పార్టీని పరుగులు పెట్టించాలని భావిస్తున్న ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆదిశగా…
ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి నాలుగు మాసాలు అయింది. అయితే… వచ్చిన తొలినాళ్లలో చేయాలనుకున్న పనులను కొంత లేటుగా ప్రారంభించేవారు.…
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులే లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే…
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఈమధ్య మరింత స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్ 3’లో నటిస్తున్నాడు.…
ఆంధ్రప్రదేశ్లో ఉన్న మద్యం ధరలకు సమానంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మద్యం ధరలు పెరగనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. త్వరలోనే బీరు…