Political News

‘అమరావతి ‘ పై ఏపీ ప్రభుత్వానికి షాక్‌ ఇచ్చిన హైకోర్టు..

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్‌ ఇచ్చింది. సుప్రీం కోర్టు వరకు వెళ్లి గెలిచి మరీ అమరావతి ఆర్‌ 5 జోన్‌ లో పేదవారికి ఇళ్లు కట్టిస్తున్నామని గొప్పగా చెప్పుకున్న ప్రభుత్వానికి హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఆర్‌ 5 జోన్‌ లో ఇళ్ల నిర్మాణం పై హైకోర్టు స్టే ఆర్డర్‌ ఇచ్చింది. కడుతున్న ఇళ్లను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌ 5 జోన్‌ ఏర్పాటు అనేది చట్ట విరుద్దమనే అంశం పై ఇటు హైకోర్టులోనూ, అటు సుప్రీం కోర్టులోనూ కొన్ని కేసులు నడుస్తున్నాయి.

ఇప్పటి వరకు రాజధాని అంశం గురించి హైకోర్టు ఇచ్చిన తీర్పు పై సుప్రీం కోర్టు ఇంకా స్టే ఇవ్వలేదు. కానీ దాని ప్రకారం మాస్టర్‌ ప్లాన్‌ లో ఎలాంటి మార్పులు చేయకూడదు. కానీ మాస్టర్‌ ప్లాన్‌ లో మార్పులు చేసేసి ఆర్‌ 5 జోన్‌ ఏర్పాటు చేసి..పేదల పేరుతో ఎక్కడెక్కడో ఉన్న ఓటు బ్యాంక్‌ లకు సెంటు భూములు పంపిణీ చేయడంతో పాఉట శంకుస్థాపన కూడా చేసేసారు.

ఇక్కడ సుప్రీం కోర్టు కూడా ఇంటి స్థలాలు పంపిణీ చేయవచ్చు కానీ..అది సాధ్యం పడదు కాబట్టి చివరి తీర్పు తరువాతనే అలాంటి అవకాశం ఉంటుంది. ఆ మేరకే ఇళ్ల పట్టాలపై ప్రింట్‌ చేయాలని చెప్పింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం తీర్పును సైతం పక్కన పెట్టింది. ఆర్ 5 జోన్‌లో ఉన్న భూమిపై ధర్డ్ పార్టీకి భూమిహక్కులు బదలాయింపు కావు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా వైసీపీ గవర్నమెంట్‌ సొంతంగా ఇళ్లు కట్టించలేదు కానీ..కేవలం అమరావతిలోనే కేంద్రం నుంచి నిధులు రాకపోయినప్పటికీ..ఇళ్లు కట్టిస్తానని ఎందుకు హడావిడి చేస్తుందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనిని అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నిస్తుందని టీడీపీ నేతలు కొందరు ఆరోపిస్తున్నారు.

ఇప్పుడు ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే విధించింది. వచ్చే డిసెంబర్ లో రాజధాని కేసులపై విచారణ జరుగుతుంది. అప్పటి వరకూ నిర్మాణాలు ప్రారంభించడం కష్టమే.

This post was last modified on August 3, 2023 11:37 am

Share
Show comments
Published by
satya
Tags: HC

Recent Posts

ఆ సంతకం చెప్పకుండా పెట్టేసిన చంద్రబాబు

టీడీపీ అధినేత‌, ఏపీ తాజా నూత‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఐదు కీల‌క హామీల‌కు సంబంధించిన ఫైళ్ల పై సంత‌కాలు చేశారు.…

27 mins ago

జ‌గ‌న్ గురించి ఇక‌పై నోరెత్త‌ను:  ఆర్ఆర్ఆర్

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ పై నిత్యం స‌టైర్ల‌తో విరుచుకుపడే ఆ పార్టీ మాజీ ఎంపీ, ప్ర‌స్తుత టీడీపీ…

13 hours ago

మలయాళ సీమలో సమంతా ఎంట్రీ

ఈమధ్య సినిమాల్లో కనిపించడం బొత్తిగా తగ్గించేసిన సమంతకు ఆఫర్లు వస్తున్నాయి కానీ తనే ఒకపట్టాన ఒప్పుకోవడం లేదని ఫిలిం నగర్…

14 hours ago

600 కోట్ల సినిమా తీసి.. బుల్లి కారులో

నాగ్ అశ్విన్.. ఇప్పుడు ఇండియన్ సినిమా ప్రియుల్లో ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న దర్శకుడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అనే చిన్న సినిమాతో…

15 hours ago

దేవర ఆగమనం ఇంకాస్త ముందుగానే

గత కొద్ది రోజులుగా అభిమానులను విపరీతమైన ఉత్కంఠకు గురి చేసిన దేవర విడుదల తేదీ మార్పు వ్యవహారం ముగింపుకొచ్చింది. ముందు…

15 hours ago

కల్కి రికార్డుల వేట మొదలు

టాలీవుడ్ నుంచి మరో ప్రపంచ స్థాయి సినిమా సిద్ధమైంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాల తర్వాత ప్రపంచాన్ని ఆశ్చర్యపరచగలదని అంచనాలున్న…

15 hours ago