టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన బ్రో చిత్రంపై ఏపీలో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో మంత్రి అంబటి రాంబాబును అనుకరిస్తూ శ్యాంబాబు క్యారెక్టర్ పెట్టారని రచ్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే పవన్, త్రివిక్రమ్, ఆ చిత్ర నిర్మాత విశ్వ ప్రసాద్ పై అంబటి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేకాదు, ఆ చిత్రాన్ని నిర్మాణం కోసం అమెరికా నుంచి ఫండ్స్ ను ఇండియాకు తరలించారని, బ్లాక్ మనీని వైట్ గా మార్చి పవన్ కు ప్యాకేజీలా చంద్రబాబు ఇచ్చారని ఆరోపించారు.
ఆ నిధుల వ్యవహారంపై ఈడీని, సీబీఐని ఆశ్రయిస్తానని కూడా చెప్పారు. ఏదో ఫ్లోలో అంబటి అలా అన్నారని అంతా అనుకున్నారు. కానీ, ఆ వ్యవహారంపై నిర్మాత క్లారిటీనిచ్చినా…అంబటి మాత్రం తగ్గడం లేదు. ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అంబటి చెప్పారు. ఒక కీలకమైన విషయం కోసం తాను ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నానని చెప్పారు. ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత అన్ని వివరాలను మీడియాకు వెల్లడిస్తానని అన్నారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్, నిధులకు సంబంధించి నిర్మాత వెర్షన్, తన వెర్షన్ అందరికీ తెలుసని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే అంబటిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోండగా…చంద్రబాబు, పవన్ లపై విమర్శలు వస్తున్నాయి. పోలవరం సహా ఏ ప్రాజెక్టుకు నిధులు కావాలని ఢిల్లీ గడప తొక్కని అంబటి…బ్రో అంటూ పనికిమాలిన విషయంపై ఢిల్లీ వెళ్తున్నారని నెటిజన్లు దుయ్యబడుతున్నారు. ఇక, రాయలసీమలో చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన వ్యవహారంతో వైసీపీకి, నీటిపారుదల శాఖా మంత్రి అంబటికి భారీ డ్యామేజీ జరిగిందని, అందుకే ఆ టాపిక్ ను డైవర్ట్ చేసేందుకు బ్రో పంచాయతీని అంబటి పెట్టారని అంటున్నారు. అంబటి ట్రాప్ లో చంద్రబాబు, పవన్ పడ్డారని కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on August 2, 2023 9:34 pm
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…
సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి…