జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లే ఉంది. పదేపదే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెళ్ళిళ్ళు, విడాకుల వ్యవహారాన్ని మీడియాలో మాట్లాడుతున్నారు. నిజానికి పెళ్ళిళ్ళు, విడాకులన్నది పూర్తిగా పవన్ వ్యక్తిగత విషయం. దానిద్వారా లాభమైనా, నష్టమైనా భరించాల్సింది పవనే కానీ అంబటి కాదు. మరెందుకు అంబటి పదేపదే పవన్ పెళ్ళిళ్ళ విషయాన్ని ఎటాక్ చేస్తున్నారో అర్థం కావటం లేదు. తాజాగా రిలీజైన పవన్ సినిమాలో ఏదో క్యారెక్టర్ తో ఒక డ్యాన్స్ చేయించారట.
ఆ క్యారెక్టర్ ను తీర్చిదిద్దింది తనను ఇమిటేట్ చేయటానికే అన్నట్లుగా రాంబాబు రెచ్చిపోతున్నారు. సినిమాల్లో అనేక క్యారెక్టర్లను డైరెక్టర్లు డిజైన్ చేస్తుంటారు. అలాంటి క్యారెక్టర్లో ఏదో ఒకదానికి ఎవరితోనో పోలికుండటం సహజమే. అంతమాత్రాన వాళ్ళంతా ఇపుడు అంబటి చేస్తున్నట్లుగా గోలచేయలేదు. సినిమాలో క్యారెక్టర్ బాగున్నా లేకపోయినా అసలు పట్టించుకోరు. మరి ఇంతచిన్న లాజిక్ ను అంబటి ఎందుకు ఆలోచించలేదో అర్ధంకావటంలేదు.
ఆ ఇమిటేషన్ క్యారెక్టర్ ను పట్టుకుని రెండురోజులుగా మంత్రి నానా గోల చేస్తున్నారు. పవన్ క్యారెక్టర్ పై తొందరలోనే తాను సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు. అందుకు అవసరమైన టైటిళ్ళను పరిశీలిస్తున్నట్లు మీడియాలో చెప్పారు. నిజంగా అంబటి ప్రకటన చాలా చీపుగా ఉంది. పవన్ క్యారెక్టర్ ను ఉద్దేశించి కొన్ని సినిమాల్లో ప్యారడీలు ఇప్పటికే ఉన్నాయి. వాటిని చూసి పవన్ ఎప్పుడూ రెచ్చిపోలేదు. పదేపదే పవన్ పెళ్ళిళ్ళగురించి మాట్లాడటం వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగముందా ?
పవన్ మీద పెట్టే దృష్టిని సాగునీటి ప్రాజెక్టుల మీద రివ్యూలకు పెడితే కనీసం సబ్జెక్ట్ నాలెడ్జి అన్నా పెరుగుతుంది. శాఖపై సమీక్షలు చేసినట్లుంటుంది. ఆ వివరాలను మీడియాలో చెబితే ప్రాజెక్టు పనుల డెవలప్మెంట్ వివరాలను జనాలకు చెప్పినట్లుంటుంది. జరగాల్సిన పనులు చూడకుండా పవన్ సినిమాలో బ్లాక్ మనీ ఉంది, రెమ్యునరేషన్ కు తగ్గట్లు పన్నులు కడుతున్నారా ? తాను తీయాలని అనుకుంటున్న సినిమాకు టైటిళ్ళు ఏదైతే బాగుంటుందనే పనికిమాలిన విషయాలు మాట్లాడటం మానుకుంటే బాగుంటుంది. రాజకీయంగా పవన్ను ఎంతైనా విమర్శించచ్చు. వ్యక్తిగతాన్ని పదేపదే విమర్శించటాన్ని ఎవరూ హర్షించరని అంబటి మరచిపోయినట్లున్నారు.
This post was last modified on August 2, 2023 11:53 am
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…