Political News

కొత్త స్టైల్లో బాబు ప్రసంగం… సింహంలా బతుకుతా !

‘సింహంలా బతుకుతా.. శాశ్వతంగా సింహంలా ఉంటా’.. అంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో ప‌ర్య‌టిస్తున్న చంద్ర‌బాబు తాజాగా నందికొట్కూరు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్ షో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నందికొట్కూరు సెంట‌ర్‌లో ఆయ‌న వాహ‌నంపై నుంచి మాట్లాడుతూ.. కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను ఎవ‌రూ వేలు పెట్టి చూపించే ప‌రిస్థితి లేద‌ని.. త‌నపై ఎవ‌రూ కేసులు పెట్టే ప‌రిస్థితి కూడా లేద‌ని చెప్పారు. తాను త‌న వ్య‌క్తిగ‌త జీవితంలోను.. ప్ర‌జాజీవితంలోనూ ఎంతో నిబ‌ద్ధ‌త‌తో జీవిస్తున్నాన‌ని చెప్పారు.

అందుకే తాను సింహంలా బతుకుతా.. శాశ్వతంగా సింహంలా ఉంటా! అని వ్యాఖ్యానించారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చేందుకు మ‌రో ఆరుమాసాలే ఉంద‌ని.. ఈ మాసాల పాటు కొన్ని క‌ష్టాలు భ‌రించాల్సిందేన‌ని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కరెంటు ఉత్పత్తిలో నూతన విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని అగ్ర‌గామిగా నిల‌బెడ‌తాన‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ప్రాణ‌సంక‌టంగా ఉన్న‌ కరెంటు చార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. యువగళం పాద‌యాత్ర‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింద‌ని చంద్ర‌బాబు చెప్పారు. యువ‌త పెద్ద సంఖ్య‌లో రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

ఏ ఊరికి వెళ్లినా జాబ్ కావాలంటే బాబు రావాలని యువత అంటున్నారని.. ఈ నినాదం మ‌రింత ఉవ్వెత్తున సాగాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి రాగానే 2 ల‌క్ష‌ల పైచిలుకు ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. ఆరు నెలలు కస్టపడితే మీ జీవితాల్ని బాగు చేస్తానన్నారు. ఏడాదికి 20 వేలను రైతుల ఖాతాల్లో జమ చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.

“సైకో ముఖ్యమంత్రి జగన్ నా వయసు గురించి, క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. నేను నాజీవితంలో సింహంలా బతుకుతా.. శాశ్వతంగా సింహంలా ఉంటా” అని చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. “రోజుకు 18 గంటలు పని చేస్తా. ముందు ఇరవై ఏళ్లకు కావాల్సిన వాటిపై ఆలోచిస్తా. సీఎం జగన్ రోజుకు ఒక గంటైనా పని చేస్తున్నాడా?” అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇంట్లో చదువుకునే పిల్లలందరికీ అమ్మ ఒడి ఇస్తామన్నారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తానని, 2019లో సైకో జగన్ రాక పోయింటే ఏపీ, తెలంగాణకు సమానంగా అభివృద్ధి చెందేదని తేల్చి చెప్పారు.

వైసీపీ క‌ర‌ప్ష‌న్ పార్టీ!

వాటర్ ట్యాంక్‌లలో బాంబులు పెట్టుకునే వైసీపీ నేతలు నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్నారని, వైసీపీ అంటే కరప్షన్ పార్టీగా అభివర్ణించారు. నీటి ఆవశ్యకత కోసం తాను చేపట్టిన ప్రాజెక్టుల యుద్ధం గురించి అందరికీ చెప్పాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

This post was last modified on August 1, 2023 10:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సజ్జల కాదు.. జగన్‌నే అసలు సమస్య..?

వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…

1 hour ago

వీడియో: అంబటి సంక్రాంతి సంబరాలు

భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…

3 hours ago

టైగర్ పవన్ కు మోడీ ప్రశంస

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మ‌రోసారి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నుంచి ప్రశంస‌లు ల‌భించాయి. గ‌తంలోనూ ప‌లు…

4 hours ago

‘చంద్ర‌బాబు ప‌నిరాక్షసుడు’

పండుగ అన‌గానే ఎవ‌రైనా కుటుంబంతో సంతోషంగా గ‌డుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట‌.. కొంత స‌మ‌యాన్ని ఫ్యామిలీకి…

7 hours ago

ఊపిరి పీల్చుకున్న విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…

10 hours ago

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

14 hours ago