ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో కేసీయార్ లో టెన్షన్ పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే అప్పుడెప్పుడో ఇఛ్చిన రైతు రుణమాఫీ ఇంకా మాపీ కాకపోవటమే. రైతు రుణమాఫీ సంపూర్ణం కాకుండా మళ్ళీ ఎన్నికలకు వెళితే ఫలితం ఎలాగుంటుందో కేసీయార్ కు అర్ధంకావటంలేదు. 2018 ఎన్నికల తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ మాట్లాడుతు నాలుగు విడతల్లో రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. సంపూర్ణంగా రైతు రుణమాఫీ అవ్వాలంటే రు. 27,835 కోట్లు అవసరమవుతుందని లెక్కలు వేశారు.
ఇప్పటికి రెండు విడుతల్లో రుణమాఫీ చేసింది రు. 1207 కోట్లు మాత్రమే. మొన్నటి బడ్జెట్లో రుణమాఫీకి ప్రభుత్వం కాగితాల మీద చూపించింది రు. 6,385 కోట్లు. కానీ బడ్జెట్ ఆర్డర్ రిలీజ్ ఇచ్చింది రు. 3369 కోట్లకు మాత్రమే. ఎందుకిలా అంటే కాగితాల మీద ఎంతైనా కేటాయింపులు చూపిస్తారు. కానీ వాస్తవంలోకి వచ్చేసరికి నిధులను విడుదల చేయాలి కదా. సరిపడా నిధులు ఉంటేనే కదా రిలీజ్ చేయటానికి. చేతిలో నిధులు లేకుండా రైతులను మోసం చేయటమే టార్గెట్ గా నోటికొచ్చిన హామీలిచ్చేస్తే పరిస్ధితి ఇలాగే ఉంటుంది.
చేయాల్సిన రుణమాఫీ సుమారు. 27 వేల కోట్లయితే ఇప్పటికి చేసింది రు. 1207 కోట్లు మాత్రమే. అంటే చేయాల్సిన రుణమాఫీ సుమారు 25 వేల కోట్ల చిల్లరుంది. షెడ్యూల్ ఎన్నికలకు ఇంక ఉన్న సమయం నాలుగు నెలలు మాత్రమే. ఈ నాలుగు నెలల్లో ఏమవుతుంది ? నాలుగున్నరేళ్ళక్రితం ఇచ్చిన హామీని మరో నాలుగు నెలల్లో ఎలా నెరవేర్చగలదు ప్రభుత్వం. ఆ నిధుల సమీకరణ కోసమే ప్రభుత్వ భూములను వేలంపాటల్లో అమ్మేస్తున్నారు కేసీయార్.
భూములమ్మగా వచ్చిన డబ్బులతో కాళేశ్వరం అప్పులు+వడ్డీలే తీరుస్తారా ? లేకపోతే రైతు రుణమాఫీ చేస్తారా ? అదీలేకపోతే దళితబంధు, బీసీ బంధు, మైనారిటీలకు లక్ష రూపాయల రుణాలకే ఖర్చు పెడతారా ? ఇచ్చిన హామీలు కొండంత అయితే ఖజానాలో ఉన్నది చిల్లిగవ్వంత. అందుకనే రాబోయే ఎన్నికల్లో రైతులు ఎలా రియాక్టవుతారో కేసీయార్ అంచనా వేయలేకపోతున్నారు. తప్పుడు హామీలివ్వటం ఎందుకు అనవసరంగా ఇరుక్కోవటం ఎందుకు ?
This post was last modified on August 1, 2023 10:18 am
https://youtu.be/g3JUbgOHgdw?si=jpCbsxB5cP_qeRwA ఇతర రాష్ట్రాల్లో ప్రభాస్ కాకుండా ఒక తెలుగు హీరోకి ఇంత క్రేజ్ ఏమిటాని అందరూ ఆశ్చర్యపోయే రీతిలో పుష్ప…
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి అరెస్ట్ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇటీవల చెన్నై…
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్‌లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…