Political News

కేసీఆర్ ఎన్నిక‌ల వ‌రాలు.. కేబినెట్‌లో సంచ‌ల‌న నిర్ణ‌యాలు!

ఎన్నిక‌ల‌కు మ‌రో మూడు మాసాల గ‌డువే ఉండ‌డం.. అన్ని పార్టీలూ.. కూడా అధికారంపై క‌న్నేయ‌డంతో తెలంగాణ అధికార పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్‌.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అన్నివ‌ర్గాల వారినీ త‌న‌వైపు తిప్పుకొనేలా.. కోట్ల కు కోట్ల రూపాయ‌ల ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెడుతున్నారు.అదే స‌మ‌యంలో కాంట్రాక్టు ఉద్యోగుల‌ను రెగ్యుల‌ర్ చేయ‌డం.. ఉద్యోగుల‌కు పీఆర్సీ ప్ర‌క‌టించ‌డం.. స‌హా.. అనేక సంచ‌ల‌న చ‌ర్య‌ల‌కు నాంది ప‌లుకుతున్నారు.

ఈ ప‌రంప‌రలో తాజాగా కేసీఆర్‌.. త‌న కేబినెట్లో సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కార్పొరేష‌న్‌గా ఉన్న తెలంగాణ ఆర్టీసీని.. ప్ర‌భుత్వంలో విలీనం చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇది పెద్ద సంచ‌ల‌న నిర్ణ‌య‌మేన‌ని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు వేలాది మంది(43,373) ఉద్యోగులు కార్పొరేష‌న్ ప‌రిధిలో ఉన్నారు. ఇక‌, నుంచి వారంతా స‌ర్కారీ ఉద్యోగులుగా మార‌నున్నారు. వారికి కూడా.. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో స‌మానంగా పీఆర్సీని, ఇత‌ర అల‌వెన్సుల‌ను అందించ‌నున్నారు.

ఇదొక్క‌టే కాదు.. మ‌రిన్ని నిర్ణ‌యాలు కేసీఆర్ నోటి నుంచి అల‌వొక‌గా వ‌చ్చాయి. అవి.. ఏంటంటే..

  • మూడు, నాలుగేళ్లలో హైదరాబాద్‌ మెట్రో వ్యవస్థను భారీగా విస్తరిస్తారు.
  • రాయదుర్గం – విమానాశ్రయం వరకు మెట్రో రైలు, ఇస్నాపూర్‌ నుంచి మియాపూర్‌ వరకు మెట్రో విస్తరణ. మియాపుర్‌ నుంచి లక్డీకపూల్‌ వరకు, ఎల్బీనగర్‌ నుంచి పెద్ద అంబర్‌పేట వరకు, ఉప్పల్‌ నుంచి బీబీ నగర్‌, ఈసీఐఎల్‌ వరకు మెట్రో విస్తరణ.
  • జేబీఎస్‌ నుంచి తూంకుంట, ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు డబుల్‌ డెక్కర్‌ మెట్రో నిర్మాణం.
  • జులై 18 నుంచి 28 వరకు కురిసిన‌ వర్షాలు, వరదల వల్ల స‌ర్వం కోల్పోయిన వారికి సాయం చేసేందుకు త‌క్ష‌ణం రూ.500 కోట్లు విడుదల.
  • బీడీ కార్మికులతో పాటు బీడీ టేకేదారులకు పింఛన్లు
  • రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి.
  • అనాథ పిల్లల సంరక్షణ కోసం ఆర్ఫన్‌ పాలసీ
  • గవర్నర్‌ కోటాలో మండలికి దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణ
  • హైదరాబాద్‌లో హైబ్రిడ్‌ విధానంలో 4 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు
  • నిమ్స్‌లో రూ.1800 కోట్లతో మరో 2 వేల పడకల ఏర్పాటు

This post was last modified on August 1, 2023 10:13 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

58 mins ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

3 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

4 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

5 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

5 hours ago