ఏపీలో రాజకీయ సినిమాలు రెడీ అవుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను మలుపు తిప్పేలా.. రాజకీయ పార్టీల విషయంలో ప్రజలను కీలకమైన దిశకు నడిపించేలా ఆలోచనాత్మకంగా ఈ సినిమాలు రూపుదిద్దు కుంటున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఒకవైపు అధికార పార్టీ వైసీపీ నేరుగా.. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను దత్తత తీసుకుందని టాలీవుడ్ టాక్. ఈయన కూడా .. సొంతగా యూట్యూబ్ చానెల్ స్థాపించి తరచుగా.. వాటిలో వీడియోలు పోస్టు చేస్తున్నారు.
ఇదేసమయంలో వచ్చే ఎన్నికలను ప్రభావితం చేసేలా.. సంక్షేమ కార్యక్రమాలు.. ప్రత్యర్థి పార్టీల దూకు డును విమర్శనాత్మకంగా చూపించేందుకు వర్మ రెడీ అయ్యారని తెలిసిందే. ఇదిపైకి కనిపిస్తున్న విష యం. ఇక, మరో ఇద్దరు చోటా దర్శకులు కూడా.. వైసీపీ తరఫున సినిమాలు చేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వర్మ.. రాజకీయ ప్రత్యర్థులు.. దూకుడు వంటి కోణంలో సినిమాలు తీస్తున్నారు. ఇక, చోటా దర్శకులు సింపతీ.. ప్రజాపాలన, పథకాలు అనే కోణంలో ప్రజల మనసు కరిగించే స్క్రిప్టుతో సినిమాలు రూపొందిస్తున్నారని తెలిసింది.
ఇక, టీడీపీ విషయానికి వస్తే.. నేరుగా ఈ పార్టీ ఫండింగు లేదు. నేరుగా జోక్యం కూడా లేదు. అయినప్పటి కీ.. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య తీస్తున్న సినిమాలోనూ.. ఒకరిద్దరు టీడీపీకి అనుకూలంగా ఉన్న దర్శకులు తీస్తున్న సినిమాల్లోనూ టీడీపీని ప్రొజెక్టు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక, జనసేన అధినేత పవన్ కూడా నేరుగానే వైసీపీపై దాడి కాన్సెప్టును అంతర్లీనంగా చేరుస్తూ.. సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక నారా రోహిత్ లాంగ్ గ్యాప్ తర్వాత పొలిటికల్ థ్రిల్లర్ ప్రతినిథి 2 సినిమా చేస్తున్నాడు. టీవీ 5 మూర్తి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే సమ్మర్ రిలీజ్ చేస్తున్నట్టు డేట్ కూడా ప్రకటించారు. సో.. ఈ రాజకీయ సినిమాలన్నీ కూడా.. వచ్చే 2024 మార్చిలోపు తెరమీదికి వచ్చేస్తాయని అంటున్నారు. ఎందుకంటే.. అంతకు మించితే.. ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారే అవకాశం ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారట. ఇదీ.. ఇప్పుడు పార్టీల్లో హాట్ టాపిక్.
This post was last modified on July 31, 2023 10:39 pm
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…