ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయంగా కీలక పరిణాలు చోటు చేసుకుంటున్నాయి. డైలాగ్ కింగ్ మంచు మోహన్‌బాబు చిన్నకుమారుడు, తెలుగు సినీ హీరో మంచు మనోజ్.. ఆయన సతీమణి భూమా మౌనికారెడ్డిలు త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకుంటారనే చర్చ జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా అయిపోయిందని.. చంద్రబాబు అప్పా యింట్‌మెంటు కోసం వేచి చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మంచు మనోజ్.. కొన్నాళ్ల కిందట టీడీపీకే చెందిన కర్నూలు నాయకుడు, దివంగత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికను ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో రాజకీయంగా పలుకుబడి.. టీడీపీలో మంచి ఫాంలో ఉన్న నేపథ్యంలోవచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వెలుగు చూశాయి. ఈ వార్తలను విశ్లేషణలను కూడా ఎవరూ ఖండించకపోవడం గమనార్హం. మరోవైపు.. ఇప్పటికే ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి, మౌనిక అక్క అఖిల ప్రియ పోటీలో ఉన్నారు. గతంలో 2014లో జరిగిన ఎన్నికల్లో ఆమె గెలిచి మంత్రి అయ్యారు(తల్లి శోభ ఆకస్మిక మరణంతో). గత ఏడాది మాత్రం ఓడిపోయారు. ఇక, ఆ తర్వాత నంద్యాల నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి కూడా .. ఆకస్మిక గుండెపోటుతో మరణించారు.
దీంతో 2017లో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ కుటుంబానికే చెందిన భూమా బ్రహ్మానందరెడ్డి విజయం దక్కించుకున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో నంద్యాల టికెట్‌ను భూమా వారసుడికి కేటాయించాలనే ప్రయత్నం జరుగుతున్నా పోటీ తీవ్రత నేపథ్యంతో పాటు.. సినీగ్లామర్ పరంగానూ.. మంచు మౌనికకు ఇస్తే.. సునాయాశంగా గెలుస్తామనే భావన టీడీపీలో కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ఈ టికెట్ కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు.. వైసీపీ అంటీముట్టనట్టుగా ఉంటున్న మంచు మోహన్‌బాబు కూడా.. తన కుమారుల ఇష్టానికే రాజకీయాలను వదిలేశారు.
ఈ నేపథ్యంలో మంచు మనోజ్ కూడా వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నట్టు మంచు కుటుంబం కూడా లీకులు ఇస్తోంది. నా కుమారులకు రాజకీయాలపై ఆసక్తి ఉంది
అంటూ ఇటీవల మోహన్ బాబు కూడా వ్యాఖ్యానించారు. అయితే..ఇప్పటికే మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో మనోజ్.. టీడీపీలో చేరి.. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఉంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది తిరుపతి వారి సొంత ఊరు కావడం.. ఇక్కడ మంచు కుటుంబానికి విద్యా వ్యాపారం ఉండడంతో ఈ నియోజకవర్గం అయితే సేఫ్‌గా ఉంటుందని తలపోస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి చంద్రబాబు దాదాపు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని విశ్వసనీయవర్గాలు చెబుతుండం గమనార్హం.
This post was last modified on July 31, 2023 10:37 pm
ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ఒక వార్త ఫ్యాన్స్ లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. వెంకటేష్, త్రివిక్రమ్…
కేశినేని బ్రదర్స్ మధ్య రాజుకున్న ఆరోపణలు, ప్రత్యారోపణల వ్యవహారం ఏపీలో కలకలమే రేపుతోంది. పదేళ్ల పాటు విజయవాడ ఎంపీగా నాని…
మొదటి వారం కాకుండానే హిట్ 3 ది థర్డ్ కేస్ వంద కోట్ల క్లబ్బులో అడుగుపెట్టేసింది. కేవలం నాలుగు రోజులకే…
ఫ్లాపుల పరంపరకు బ్రేక్ వేస్తూ తనకో బ్లాక్ బస్టర్ ఇస్తాడని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మీద సూర్య పెట్టుకున్న నమ్మకం…
అమెరికాలో విడుదల కాబోయే విదేశీ సినిమాలకు ఇకపై వంద శాతం టారిఫ్ విధిస్తున్నట్టు ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడం ఒక్కసారిగా…
గత కొన్నేళ్లలో తమిళ సినిమాల క్వాలిటీ బాగా పడిపోయిన మాట వాస్తవం. ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ సినిమాలు తీసే ఇండస్ట్రీగా…