మరోసారి తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. తాను కాంగ్రెస్‌లోనే ఉంటున్నప్పటికీ పార్టీ మారతారనే ప్రచారం చేస్తున్నారని కీలక నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా ప్రకటించారు. తనను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీలోని ఓ కీలక నాయకుడే ఇదంతా చేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. ఆ కీలక నాయకుడు ఎవరనే పేరు ఉత్తమ్ చెప్పనప్పటికీ.. అది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మళ్లీ ఉత్తమ్, రేవంత్‌ల మధ్య వార్ మొదలైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అయితే వాస్తవానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య మాజీ ఎమ్మెల్యే పద్మావతి కాంగ్రెస్ను వీడి అధికార బీఆర్ఎస్‌లో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల ఉత్తమ్ అనుచరుడు అనిల్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి.. కారెక్కిన సంగతి తెలిసిందే. దీంతో ఉత్తమ్ పార్టీ మార్పు కచ్చితంగా ఉంటుందనే అభిప్రాయాలు బలపడ్డాయి. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఉత్తమ్‌కు ఎంపీ టికెట్, ఆయన భార్యకు ఎమ్మెల్యే టికెట్ రిజర్వ్ కూడా చేసుకున్నారని చెబుతున్నారు.
గత కొద్దికాలంగా ఈ ప్రచారం సాగుతుండడంతో మంట లేనిదే పొగ రాదనే చందంగా.. ఏదో నిజం దాగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ కండువా కప్పుకునే ప్రయత్నాల్లో ఉత్తమ్ ఉన్నారనే ఊహాగానాలు కూడా నిజమయ్యేలా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎలాగో పార్టీ మారడం ఖాయం కాబట్టి.. ఎలాంటి కారణం లేకుండా వెళ్తే బాగుండదని భావించిన ఉత్తమ్.. ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరును తెరపైకి తీసుకొచ్చారనే చర్చ జోరందుకుంది. పార్టీలో కీలక పదవిలో ఉన్న ఓ వ్యక్తే సామాజిక మాధ్యమాల్లో ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ అన్నారు. దీంతో పరోక్షంగా రేవంత్‌పై నిందలు మోపి.. చివరకు రేవంత్ కారణంగానే కాంగ్రెస్ వీడుతున్నట్లు ఉత్తమ్ ప్రకటించే రోజు ఎంతో దూరంలో లేదన్నది టాక్.
This post was last modified on July 30, 2023 10:12 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…