Political News

బీజేపీకి 6 ఎంపీ సీట్లా ?

తాజాగా ఇండియా టు డే-సీఎన్ఎక్స్ సంస్ధ తెలంగాణాకు సంబంధించి విడుదల చేసిన ప్రీ పోల్ సర్వే వివరాలు కాస్త ఆశ్చర్యంగానే ఉంది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ కు 8 వస్తాయట. ఇపుడు తొమ్మిది మంది ఎంపీలున్నారు. అంటే ఒక సీటు మైనస్ అవుతుందని తేలింది. ఇక బీజేపీకి ఆరుసీట్లు వస్తాయని సర్వే ద్వారా తేలింది. ఇపుడు నాలుగు ఎంపీ స్ధానాలు మాత్రమే ఉన్నాయి. అంటే రెండు సీట్లను బీజేపీ అదనంగా గెలుచుకుంటుంది.

ఇక కాంగ్రెస్ కు రెండు సీట్లు దక్కుతాయని చెప్పింది. ప్రస్తుతం హస్తంపార్టీకి మూడు ఎంపీ స్ధానాలున్నాయి. అంటే ఒకటి మైనస్ అవుతుందని సర్వే చెబుతోంది. మిగిలిన ఒక్క స్ధానం ఎంఐఎం నిలుపుకుంటుందని అర్ధమవుతోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే బీజేపీకి ఆరు నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలున్నాయని సర్వేలో తేలటమే. నిజానికి అసెంబ్లీ నియోజకవర్గాల విషయం చూస్తే అన్ని చోట్లా గట్టి అభ్యర్ధులు దొరక్క నానా అవస్తలు పడుతోంది.

ఇలాంటి పార్టీ ఏకంగా ఆరు ఎంపీ స్ధానాల్లో గెలుస్తుందని సర్వేలో తేలటమే ఆశ్చర్యంగా ఉంది. అయితే ఇక్కడో చిన్న లాజిక్ ఉంది. అదేమిటంటే పోయిన ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లలో గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. బ్యానెర్లు కట్టేందుకు, జెండాలు మోసేందుకు కూడా పార్టీకి జనాలు లేకపోయినా నాలుగు సీట్లు ఎలా గెలిచిందని చాలామంది ఆశ్చర్యపోయారు. అదే పద్దతిలో తమ బలం పెరగబోతోందని కమలనాదులు అంటున్నారు.

అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే ప్రచారం జరుగుతున్నట్లు కేసీయార్ పాలన మీద జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోతోంది. అదే నిజమైతే జనాల్లోని వ్యతిరేకత కాంగ్రెస్ కు ప్లస్ కావాలి కానీ బీజేపీకి ఎలాగ ప్లస్ అవుతుందన్నది హస్తంపార్టీ నేతల ప్రశ్న. ఎందుకంటే జాతీయస్ధాయిలో నరేంద్రమోడీ మీద కూడా వ్యతిరేకత ఉందని కాంగ్రె నేతలంటున్నారు. మోడీ, కేసీయార్ ఇద్దరి మీద జనాల్లో వ్యతిరేకత ఉందికాబట్టి అసెంబ్లీ, పార్లమెంటు రెండు ఎన్నికల్లోను కాంగ్రెసే లాభపడుతుందని నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే బీజేపీ ఆరు ఎంపీ సీట్లను గెలుస్తుందంటే నమ్మలేకపోతున్నారు.

This post was last modified on July 30, 2023 12:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇలాంటి సమయంలో పార్లమెంటుకు రాకపోతే ఎలా రాహుల్ జీ

కాంగ్రెస్ అగ్ర‌నేతే కాదు.. లోక్‌స‌భలో విప‌క్ష నాయ‌కుడు కూడా అయిన రాహుల్‌గాంధీ.. త‌ర‌చుగా త‌ప్పులు చేస్తూనే ఉన్నారు. అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు…

14 minutes ago

ఇడియట్స్ జోలికి ఇప్పుడెందుకు వెళ్లడం

2009లో విడుదలైన బాలీవుడ్ మూవీ 3 ఇడియట్స్ ఒక సంచలనం. అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోని కాలేజీ స్టూడెంట్…

43 minutes ago

`స‌నాత‌న ధ‌ర్మం` స్టాండ్.. సాయిరెడ్డిని ర‌క్షిస్తుందా.. ?

వైసీపీ మాజీ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల…

2 hours ago

సినిమా నచ్చకపోతే బాలేదని నలుగురికి చెప్పండి

ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయ‌డం అన్న‌ది పెద్ద రిస్క్‌గా మారిపోయిన మాట వాస్త‌వం. ఇంట‌ర్నెట్, ఓటీటీల విప్ల‌వం వ‌ల్ల…

5 hours ago

‘ఫస్ట్ టైమ్’ ఎంపీకి ‘ఫస్ట్ ర్యాంక్’ ఎలా వచ్చింది?

టీడీపీ ఎంపీ, గుంటూరు పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌, తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో రాష్ట్రంలోని 25…

6 hours ago

శుభవార్త చెప్పబోతున్న అఖండ 2 ?

గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…

8 hours ago