Political News

పాపం జ‌గ్గారెడ్డి..ఆయ‌నే బ‌క‌రా చేసేశాడు

కాంగ్రెస్ పార్టీలో పైర్‌బ్రాండ్ నేత‌గా సుప‌రిచితుడు అయి, అనంత‌రం అధికార టీఆర్ఎస్ పార్టీ పెద్ద‌ల భ‌‌జ‌న కార్య‌క్ర‌మంలో మునిగిపోయిన జ‌గ్గారెడ్డి సొంత పార్టీ నేత‌ల‌కే షాకిచ్చిన సంగ‌తి తెలి‌సిందే.

అయితే, పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమారెడ్డిని మాత్రం ఆయ‌న అవ‌కాశం వ‌చ్చిన‌పుడు స‌మ‌ర్థించేవారు పొగిడేవారు. తాజాగా ఆయ‌న‌కు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రూపంలో షాక్ త‌గిలింది. అది కూడా ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా విష‌యంలోనే కావ‌డం గ‌మ‌నార్హం.

ఒక్క ఆర్టీసీ స‌మ్మె అంశం మినహాయిస్తే కేసీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ జగ్గారెడ్డి పలు అంశాలపై ఆకాశానికి ఎత్తేశారు. తరచూ ప్రభుత్వాన్ని పొగుడుతూ.. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసమే అంటూ స‌ర్దిచెప్పుకొచ్చారు. ఆఖ‌రికి చిరకాలంగా వ్యతిరేకిస్తున్న హరీశ్ రావుతోను జగ్గారెడ్డి భేటీ అయ్యారు. తాజాగా టీఆర్ఎస్ స‌ర్కారుకు ఒకింత అనుకూల‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇటీవ‌ల క‌న్నుమూసిన దుబ్బాక ఎమ్మెల్యే రామ‌లింగారెడ్డికి సంతాపం ప్ర‌క‌టించిన ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ఉప ఎన్నిక‌లో రామలింగారెడ్డి భార్యకే టికెట్ ఇవ్వాల‌ని కోరారు. రామ‌లింగారెడ్డి భార్య‌కు టికెట్ ఇస్తే.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో తాను మాట్లాడుతానని జ‌గ్గారెడ్డి ప్ర‌క‌టించేశారు.

అయితే, ఈ విష‌యంలో తాజాగా జ‌గ్గారెడ్డికి తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి షాకిచ్చారు. దుబ్బాక బై పోల్‌లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. దుబ్బాక ఎన్నికలపై ఎవ‌రు ఎన్ని మాట్లాడినా అది వారి వ్యక్తిగత‌మ‌న్న ఉత్త‌మ్… మండలాల వారిగా సమావేశాలు పెట్టాలని డీసీసీకి ఆదేశాలు జారీ చేశారు.

దుబ్బాక బ‌రిలో కాంగ్రెస్ అభ్య‌ర్థిని నిల‌ప‌డానికి గ‌ల కార‌ణాన్ని కూడా ఉత్త‌మ్ తెలిపారు. గతంలో టీఆర్ఎస్ పోటీ చేసింది కాబ‌ట్టే.. మేం కూడా పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. స్వ‌యంగా పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఇచ్చిన షాక్‌తో జ‌గ్గారెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి.

This post was last modified on August 17, 2020 12:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మొన్న టీచర్లు.. నేడు పోలీసులు.. ఏపీలో కొలువుల జాతర

ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…

50 minutes ago

రఘురామ జైలులో ఉన్నప్పుడు ముసుగు వేసుకొని వచ్చిందెవరు?

నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…

2 hours ago

అకీరాను లాంచ్ చేయమంటే… అంత‌కంటేనా?

తెలుగు సినీ ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నంద‌న్‌ది ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

2 hours ago

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

3 hours ago

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

3 hours ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

4 hours ago