ఆంధ్రపదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడుతో సాగుతున్నారు. జగన్‌ను ఇంటికి పంపించడమే కాకుండా తాను ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని పవన్ చాలా సార్లు ప్రస్తావించారు. ఒక్కసారి సీఎం అవకాశం ఇవ్వండి అంటూ ఓటర్లను అడుగుతున్నారు. మరోవైపు ఎక్కడా ఏ సభ, సమావేశం జరిగినా ఆయన అభిమానులు.. సీఎం సీఎం అంటూ కేకలు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ సీఎం కోరికను బీజేపీ తీరుస్తానంటోంది.
పవన్‌ను సీఎం చేస్తామని బీజేపీ అంటోంది. అది ఎలా అంటారా? వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తుతోనే బీజేపీ బరిలో దిగే అవకాశం ఉంది. దీంతో తమ పొత్తులో భాగంగా పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ కసరత్తులు చేస్తోందని సమాచారం. ఇటీవల ఎన్డీయే సమావేశానికి కూడా పవన్ హాజరయ్యారు. దీంతో పవన్‌ను ముఖ్యమంత్రిగా నిలబెట్టాలని బీజీపీ అనుకుంటోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై బీజేపీ అధికారిక ప్రకటన చేసే అవకాశముందని అంటున్నారు.
మరోవైపు వైసీపీని ఓడించేందుకు అనుగుణంగా వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలని ఇతర పార్టీలను కలుపుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. కానీ టీడీపీతో మాత్రం పొత్తు ఉండదని బీజేపీ చెబుతూనే ఉంది. దీంతో టీడీపీని పవన్‌కూ దూరంగానే ఉంచాలనే ఆలోచనతో బీజేపీ.. ఆయన్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించే ఆస్కారముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టీడీపీ ఓటు బ్యాంకును కూడా తమ వైపు మళ్లించేందుకు బీజేపీ అధిష్ఠానం కసరత్తులు చేస్తోంది. టీడీపీని ఒంటరిగా మార్చి.. జనసేనతో పొత్తుతో లాభపడాలని చూస్తోంది. కానీ జనసేన- బీజేపీ పొత్తు ఆశించిన ఫలితాలు రాబట్టగలదా? అన్నదే ఇక్కడ ప్రశ్న.
This post was last modified on July 29, 2023 4:26 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…