టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి మధ్య ఉన్న రాజకీయ విమర్శల యుద్ధం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడంలో రేవంత్ ముందుంటారు. దాన్ని తిప్పికొట్టేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. అయితే, తాజాగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేందుకు కేసీఆర్ సర్కారుకు కీలక అవకాశం దొరికిందని ప్రచారం జరుగుతోంది. అదే అవినీతి ఎమ్మార్వో ఏసీబీకి చిక్కిన ఉదంతం.
హైదరాబాద్ కీసర తాసిల్దార్ నాగరాజు ఏసీబీ చరిత్రలోనే అత్యంత భారీ మొత్తం లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఉదంతం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎపిసోడ్ మరిన్ని మలుపులు తిరుగుతోంది. భూవివాదం సెటిల్‌మెంట్ కోసం తాసిల్దార్ నాగరాజు శుక్రవారం రూ.కోటి 10 లక్షల తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు.. లంచం ఇస్తున్న ఉప్పల్‌లోని సత్య డెవలపర్స్‌కు చెందిన చౌవ్ల శ్రీనాథ్‌యాదవ్, రాంపల్లి దయారా గ్రామానికి చెందిన కందాడి అంజిరెడ్డిని సైతం అరెస్టు చేశారు.
ఈ కేసులో కీలకవ్యక్తిగా ఉన్న రాంపల్లి దయారాకు చెందిన అంజిరెడ్డి ఇంట్లో మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి సంబంధించిన పలు అధికారిక పత్రాలను ఏసీబీ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. రేవంత్‌రెడ్డి.. ఎంపీలాడ్స్ సంబంధించిన పలు పత్రాలు, పలు వివాదాస్పద భూములపై రేవంత్‌రెడ్డి ఆర్టీఐ కింద చేసిన దరఖాస్తులు ఇందులో ఉన్నాయి. అంజిరెడ్డికి రేవంత్‌తో సన్నిహిత సంబంధాలు ఉండి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగానూ ఆరా తీస్తున్నట్టు సమాచారం. మొత్తంగా ఈ భారీ అవినీతి ఎపిసోడ్ అంశంతో రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ ఇరుకున పెట్టడం ఖాయమంటున్నారు.
This post was last modified on August 17, 2020 10:18 am
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…
టాలీవుడ్ లో వరస అవకాశాలు వస్తున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి టాప్ త్రీలో ఉంది. హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే కాల్…
జగన్ హయాంలో అనేక తప్పులు జరిగాయని సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే.. మరీ ముఖ్యంగా కొన్ని తప్పుల కారణంగా.. రాష్ట్రం…
సూర్య ప్యాన్ ఇండియా మూవీ కంగువాకు బాక్సాఫీస్ వద్ద వస్తున్న స్పందన చూసి అభిమానులు సంతోషంగా లేరన్నది ఓపెన్ సీక్రెట్.…
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో…