కొంతకాలంగా వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ వర్సెస్ జనసేన నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ మాటల యుద్ధం తాజాగా తారస్థాయికి చేరింది. తాజాగా పవన్ కల్యాణ్ నటించిన బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబుపై పవన్ పరోక్షంగా పంచ్ లు వేశారు.
ఆ చిత్రంలో పృథ్వీ రాజ్ పోషించిన శ్యాంబాబు పాత్ర అంబటిపై డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. అంబటి వేసుకున్న డ్రెస్ ధరించిన పృథ్వీ గెటప్, ఓ పాటలో ఆయన వేసిన స్టెప్పులు …అంబటి వేసిన డ్యాన్సులను పోలి ఉండడంతో సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయింది. ఈ ఏడాది మొదట్లో సంక్రాంతి సంబరాల్లో అంబటి రాంబాబు వేసిన స్టెప్పుల…తాజా స్టెప్పులు వైరల్ అయ్యాయి. ‘నెక్స్ట్ ఏంటి?’ అని పవన్ అడిగితే… ససెక్స్.స అని శ్యాంబాబు బదులిస్తాడు.
నీకెప్పుడూ అదే ధ్యాస.. అందరూ మీలా ఆలోచించరని, ఈ లలిత కళలను వదిలేయమని శ్యాంబాబుకు పవన్ పంచ్ వేస్తాడు. ఈ నేపథ్యంలోనే పవన్ పై అంబటి చేసిన ట్వీట్ వైరల్ అయింది. ‘గెలిచినోడి డాన్స్ సంక్రాంతి.. ఓడినోడి డాన్స్ కాళరాత్రి # పవన్ కల్యాణ్’ అని అంబటి ట్వీట్ చేశారు. మరి, అంబటి ట్వీట్ పై పవన్ స్పందన ఏమిటన్నది ఆసక్తిగా మారింది.
This post was last modified on July 29, 2023 2:03 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…