తెలంగాణలో ఈ ఏడాది చివరినాటికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా మరో 8 మాసాల్లో పార్లమెంటు ఎన్నికలు కూడా జరగనున్నాయి. మొత్తం 119 స్థానాలున్న అసెంబ్లీ, 17 స్థానాలున్న పార్ల మెంటు ఎన్నికలను కూడా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా నే తీసుకున్నాయి. అయితే.. ఎవరికి వారు అధి కారంపై ధీమా, పార్లమెంటులో సత్తాపై ప్రకటనలు చేస్తున్నారు కానీ.. ప్రజల నాడిని పట్టలేక పోతున్నాయ ని తెలంగాణ మేధావులు అభిప్రాయపడుతున్నారు.
అధికార బీఆర్ ఎస్ పార్టీ పరిస్థితిని పక్కన పెడితే.. ఈ పార్టీని అధికారం నుంచి దింపేందుకు ఇతర పార్టీ లు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు ఎవరికి వారే అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ, ఈ పార్టీల దూకుడు ఎలా ఉన్నా.. ప్రజల నాడిని పట్టుకోవడంలో విఫలమవుతున్నా యనేది మేధావుల మాటగా ఉంది. ఎందుకంటే.. ఇప్పటికి రాష్ట్రం వచ్చి 9 ఏళ్లు పూర్తయినా.. కేసీఆర్ సర్కారు అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు అయిపోయినా.. వారి ఆశలు ఫలించలేదనే టాక్ వినిపిస్తోంది.
ఈ విషయాన్ని పార్టీలు కూడా గుర్తించాయి నిధులు, నియామకాలు, నీళ్లు అనే మూడు నినాదాలతో రాష్ట్రా న్ని సాధించుకున్నా.. వాటిని సాధించలేక పోయారనే వాదన వినిపిస్తోంది. పొరుగు రాష్ట్రాలతో జల వివాదాలు.. నియామకాల్లో ఇంకా స్పష్టత లేకపనోవడం.. నిధుల విషయంలో అప్పులు చేయడం వంటివి ప్రజ ల మధ్య చర్చకు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆయా విషయాల్లో సంతృప్తి లేదు. దీంతో ప్రస్తుతం ఇతర పార్టీలైనా ఈ విషయాలను బలంగా ప్రస్తావిస్తాయని వారు భావిస్తున్నారు.
కానీ, ఆదిశగా పార్టీలు ప్రయత్నం చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. పార్టీల్లో అంతర్గత విభేదాలతోనే కాలం వెళ్ల దీస్తుండడం.. పదవుల్లో మార్పులు వంటివి కూడా ప్రజలు హర్షించడం లేదు. ఇంకా ఏం మార్పులు అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. ఇది.. అంతిమంగా.. ఔనన్నా.. కాదన్నా..కేసీఆర్ తప్ప వారికి మరో ప్రత్యామ్నాయ మార్గం కనిపించడం లేదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. కనీసం ఇప్పటికైనా పార్టీలు ప్రజల నాడిని గుర్తించాలని అంటున్నారు.
This post was last modified on July 28, 2023 9:17 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…