Political News

రాజ్య‌స‌భ‌కు వైవీ.. క్లారిటీ వ‌చ్చేసిందా..!

వైసీపీ ముఖ్య‌నాయ‌కుడు, మాజీ ఎంపీ, ప్ర‌స్తుత టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డిని రాజ్య‌స‌భ‌కు పంపించనున్నారా? ఆయ‌న‌కు ఇప్ప‌టికే ఒక క్లారిటీ వ‌చ్చేసిందా? అంటే.. ఔన‌నే అంటున్నాయి తాడేప‌ల్లి వ‌ర్గాలు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందుగానే రాజ్య‌స‌భ సీట్ల‌కు మ‌రోసారి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఏప్రిల్ 24, 2024లో మూడు రాజ్య‌స‌భ స్థానాలు ఏపీ నుంచి ఖాళీ అవుతున్నాయి. వీటిలో ఒక వైవీకి రిజ‌ర్వ్ చేశార‌నేది తాడేప‌ల్లి వ‌ర్గాల టాక్‌.

ఖాళీ అవుతున్న స్థానాల్లో వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి(వైసీపీ), సీఎం ర‌మేష్‌(బీజేపీ), క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర కుమార్‌(టీడీపీ)లు ఉన్నారు. నిజానికి వీరి సీట్లు ఖాళీ అయ్యే స‌మ‌యానికి రాష్ట్రంలో ఎన్నిక‌ల ఫ‌లితం రాదు. సో.. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న అసెంబ్లీ బ‌లాబలాను బ‌ట్టి.. ఈ సీట్ల‌ను కేటాయిస్తారు. దీంతో ఈ మూడు కూడా వైసీపీకే ద‌క్క‌నున్నాయి. ఈ క్ర‌మంలో ఒక సీటును వైవీకి కేటాయించే అవ‌కాశం ఉందని పార్టీ కీల‌క నేత ఒక‌రు వ్యాఖ్యానించారు.

నిజానికి వైవీ కూడా పార్ల‌మెంటుకు వెళ్లాల‌నే భావిస్తున్నారు. ఎంపీ స్థానాలు ఎలానూ ఖాళీగా లేక‌పోవ‌డం.. పైగా ఖ‌ర్చుతో కూడుకున్న‌వి కూడా కావ‌డంతో ఆయ‌న ఈ ద‌శ‌లో రాజ్య‌స‌భ సీటుకే మొగ్గు చూపుతున్నారు. దీనిపై కొన్ని రోజులుగా సీఎం జ‌గ‌న్‌తోనూ ఆయ‌న చ‌ర్చిస్తున్నార‌ని స‌మాచారం. ప్రస్తుతం టీటీడీ చైర్మ‌న్‌గా ఉన్న వైవీని ఇప్పుడు ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పి.. వ‌చ్చే ఐదారు మాసాలు పార్టీకి వాడుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కాల‌ని పార్టీ అధినేత ల‌క్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ క్ర‌మంలోనే వైవీ కూడా .. త‌న మ‌న‌సులోని కోరిక‌ను వెల్ల‌డించార‌ని.. దీనిపై ప‌క్కా హామీ కూడా ఇచ్చార‌ని.. ఎన్నిక‌ల‌కు ముందు రాజ్య‌స‌భ‌కు వైవీ వెళ్ల‌డం ఖాయ‌మ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌కు పార్టీలో మ‌రిన్ని బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on July 28, 2023 3:36 pm

Share

Recent Posts

ఈవీఎంల వల్లే జగన్ ఓడారు: తెలంగాణ మంత్రి

2024 ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల పనితీరుపై వైసీపీ నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంల వల్లే…

19 minutes ago

లోక‌ల్ వార్‌.. వైసీపీ వాటిని వ‌దులుకోవాల్సిందే భ‌య్యా.. !

స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…

3 hours ago

బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…

5 hours ago

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…

5 hours ago

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

6 hours ago

ముగ్గుర్ని చంపేస్తే నాన్న చూసుకుంటాడా?

ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…

6 hours ago