Political News

వినుకొండలో గాయ‌ప‌డిన ‘కార్య‌క‌ర్త‌’

ఉమ్మ‌డి గుంటూరు జిల్లా వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో తాజాగా జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో ఇటు టీడీపీ, అటు వైసీపీ ల‌కు చెందిన కార్య‌క‌ర్త‌లు ప‌దుల సంఖ్య‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరు ప్ర‌స్తుతం స్థానిక ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక‌, ఆయా ఆసుప‌త్రుల‌కు నాయ‌కులు వెళ్లి ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లుచేస్తున్నారు. అయితే.. వాస్త‌వానికి ఇంత మంది కార్య‌క‌ర్త‌లు.. తీవ్ర గాయాలపాలు కావ‌డానికి ఎవ‌రిది త‌ప్పు? అనే చ‌ర్చ స్థానికంగా తెర‌మీదికి వ‌చ్చింది.

గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న వైసీపీ నేత బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు, అదే ఎన్నిక‌ల్లో ఓడిపోయిన జీవీ ఆంజ‌నేయులు మ‌ధ్య రాజ‌కీయ వైర‌మే కాకుండా.. వ్య‌క్తిగ‌త స్ప‌ర్థ‌లు కూడా ఉన్నాయి. ఇవి వైసీపీకి ముందు నుంచి కూడా కొన‌సాగుతున్నాయి. గ‌తంలో బొల్లా కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు.. జీవీ టీడీపీలో తొలిసారి టికెట్ ద‌క్కించుకున్న‌ప్ప‌టి నుంచి కూడా ఈ వివాదాలు కొన‌సాగుతున్నాయి. అయితే.. ఇటీవ‌ల కాలంలో ఎన్నిక‌ల వేడి పెరిగింది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇరు ప‌క్షాలు కూడా విజ‌యం ద‌క్కించుకుని తీరాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. ఇది రాజకీయంగా ఎవ‌రి వ్యూహాలు వారికి ఉండ‌డం త‌ప్పు కాదు. అయితే.. ఇరు ప‌క్షాలు కూడా.. వారి వారి కార్య‌కర్తల‌ను రెచ్చ‌గొట్ట‌డంలో స‌క్సెస్ అయిన ఫ‌లితంగానే ఇప్పుడు కార్య‌క‌ర్త‌లు ఇంత పెద్ద సంఖ్య‌లో గాయ‌పడ్డార‌నేది స్థానికంగా నాయ‌కులు చెబుతున్న మాట‌. వైసీపీపై టీడీపీ, టీడీపీపై వైసీపీ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.

అయితే, క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌ల‌కు ప‌దువుల ఆశ చూపించార‌ని, ఎన్నిక‌ల్లో మ‌రోసారి గెలిస్తే.. నామినేటెడ్ ప‌ద‌వులు ఇప్పిస్తామ‌ని.. వైసీపీ నేత‌, గెలుపు గుర్రం ఎక్క‌క‌పోతే.. మ‌న‌కు న‌ష్ట‌మ‌ని.. టీడీపీ నేత నూరిపోసిన నేప‌థ్యంలో కార్య‌క‌ర్త‌లు అంతిమంగా బాధితులు అయ్యార‌ని అంటున్నారు. “నాయ‌కులు, నాయ‌కులు బాగానే ఉన్నారు. ఇప్పుడు కార్య‌క‌ర్త‌ల‌పై కేసులు పెట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. ఆసుపత్రుల్లో ఉన్నారు. కూలికెళ్తే త‌ప్ప పూట గ‌డ‌వ‌దు” అని బాధితుడి త‌ల్లి ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం.. కార్య‌క‌ర్త‌ల ప‌రిస్థితికి అద్దం ప‌ట్టింది.

This post was last modified on July 28, 2023 6:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వివేకా మ‌ర్ద‌ర్: డీఎస్పీ స‌హా అధికారుల‌పై కేసులు!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసు లో తాజాగా…

16 minutes ago

జాంబిరెడ్డి – 2 : డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాదా?

గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…

19 minutes ago

ఏందిది మ‌ల్లన్నా.. స్వ‌ప‌క్షంలో విప‌క్షమా?

మాట‌ల మాంత్రికుడు.. సోష‌ల్ మీడియాలో దుమ్మురేపి.. ప్ర‌స్తుతం ప్ర‌జాప్ర‌తినిధిగా శాస‌న‌ మండ‌లిలో ఉన్న తీన్మార్ మ‌ల్ల‌న్న త‌న వాయిస్ ద్వారా…

22 minutes ago

ఆమె లేకుండా మంగళవారం – 2?

‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా..…

1 hour ago

నెరవేరిన కల..విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు

విశాఖ రైల్వే జోన్..ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన కీలక హామీలలో ఒకటి. జగన్ హయాంలో అదిగో…

1 hour ago

ట్రంప్ న్యూ ట్విస్ట్: గాజా భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే వలసదారులపై కఠిన…

1 hour ago