ఏపీ సీఎం జగన్.. ప్రతిపక్షంలో ఉండగా.. ఆయనపై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి దాడి కేసు గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికి నాలుగేళ్లకుపైగానే ఈ కేసు నానుతోంది. ఈ దాడి చేసిన జనుపల్లి శ్రీనివాసరావు అనే యువకుడు ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు. సరే.. ఈ కేసు దాదాపు పూర్తికావొచ్చింది. అయితే.. కేసులో తాజాగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును మరోసారి పూర్తిగా విచారించాలంటూ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్ ఐఏ కోర్టు తోసిపుచ్చింది.
కోడి కత్తి కేసులో తదుపరి మరింత లోతుగా దర్యాప్తు చేయాలని జగన్ తరపు న్యాయవాది ఈ కేసును విచారిస్తున్న ఎన్ ఐఏ కోర్టులో(విజయవాడ) పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ఎన్ఐఏ కోర్టు కొట్టేసింది. విచారణకు రాలేనని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి తరఫున మరో పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఈ పిటిషన్‌పై విచారణను ఆగస్టు 1న నిర్ణయిస్తామని కోర్టు పేర్కొనడం గమనార్హం. ఇక, ఈ కేసులో నిందితుడిగా జైలు జీవితం గడుపుతున్న శ్రీనివాసరావు.. బెయిల్ ఇవ్వాలని కోరుతూ.. కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్‌ను కూడా ఆగస్టు ఒకటికి వాయిదా వేసినట్లు న్యాయమూర్తి తెలిపారు. మొత్తంగా.. ఈ కేసు విచారణ ఆగస్టు 1కి వాయిదా పడడం గమనార్హం. ఇదిలావుంటే, 2018 అక్టోబర్ లో ప్రజాసంకల్ప పాదయాత్రలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి.. యాత్రకు విరామం ప్రకటించి.. హైదరాబాద్‌కు బయలు దేరారు. ఈ క్రమంలో విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఆయనపై కోడికత్తి దాడి జరిగింది. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీనిని ఎన్ఐఏ దర్యాప్తును అప్పటి చంద్రబాబు ప్రభుత్వమే అప్పగించింది.
This post was last modified on July 25, 2023 10:20 pm
అమెరికాలో అదానీపై కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను కూడా కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.…
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై గతంలో సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ హైదరాబాద్ లోని ఎన్బీకే బిల్డింగ్ నుంచి…
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…