Political News

గ‌తం మ‌రిచిపోతే ఎలా.. సీఎం వ్యాఖ్య‌ల‌పై స‌భ‌లో టాక్‌!

ఏపీ సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై స‌భ‌లో ఉన్న‌వారే.. ఒకింత ఆశ్చ‌ర్య‌పోయారు. గ‌తం మ‌రిచిపోతే ఎలా! అంటూ.. ఒక‌రిద్ద‌రు చ‌ర్చించుకోవ‌డం క‌నిపించింది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. తాజాగా అమ‌రావ‌తి ప్రాంతంలో ఆర్‌-5 జోన్‌లో పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాలు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో వారు ఇళ్లు నిర్మించుకునేందుకు వీలుగా చ‌దును చేసిన ప్లాట్ల‌ను కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇక్క‌డ నిర్మాణాలు చేప‌ట్టేందుకు సీఎం జ‌గ‌న్ శంకు స్థాప‌న చేశారు. అదేవిధంగా వ‌న‌మ‌హోత్స‌వాన్ని ప్రారంభించారు.

అనంత‌రం సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. పెత్తందారులపై పేదవాడు సాధించిన విజయం ఇద‌ని పేర్కొన్నా రు. ఇంటి పట్టాలు అందించి ఇప్పుడు ఇళ్ల నిర్మాణానికి పునాదు వేస్తున్నామ‌న్నారు. మన పేదల ప్రభు త్వానికి పెత్తందారుల కూటమికి యుద్ధం జరుగుతోందని చెప్పారు. ఇదేస‌మ‌యంలో విప‌క్షాల‌పై విమ‌ర్శ లు చేశారు. “పేదవాడికి ఏ మంచి పని జరిగినా అడ్డుకోవడమే వీరి పని. పేదల పిల్లలు ఇంగ్లిష్‌ మీడియంలో చదవకూడదా? పెత్తందారుల పిల్లలే ఇంగ్లీష్‌ మీడియంలో చదవాలా” అని ప్ర‌శ్నించారు.

అంతేకాదు.. పేదల శత్రువలపై పేదలు సాధించిన విజయం ఇదని సీఎం పేర్కొన్నారు. ఎన్నో అవరోధాలను అధిగమించి ఇళ్లు నిర్మిస్తున్నామ‌ని చెప్పారు. పేద‌ల‌కు అంద‌రికీ ఇళ్లు కట్టిస్తానని చంద్రబాబు మోసం చేశారని విమ‌ర్శించారు. ఇప్పుడు తాము క‌ట్టిస్తుంటే సైంధ‌వుల్లా అడ్డు ప‌డుతున్నార‌ని వ్యాఖ్యానించారు. పేదలకు ఇల్లు రాకూడదనేదే వీరందరి కుట్రగా పేర్కొన్నారు. దీని కోసం సుప్రీంకోర్టుకు వెళ్లి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రంలోనే చూశామ‌ని సీఎం వ్యాఖ్యానించారు.

అయితే.. సీఎం వ్యాఖ్య‌ల‌పై స‌భ‌లోనే ఉన్న కొంద‌రు విద్యావంతులు.. స్థానికంగా జ‌రిగిన విష‌యాల‌పై అవ‌గాహ‌న ఉన్న‌వారు బుగ్గ‌లు నొక్కుకున్నారు. గ‌తంలో ఇదే ప్రాంతంపై అనేక సార్లు కోర్టుకు వెళ్లింది మీరే క‌దా? ప్ర‌పంచ బ్యాంకు నుంచి రుణాలు ద‌క్క‌కుండా చేయ‌డంలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి లేఖ‌లు రాయ‌లేదా? కోర్టులో కేసులు వేయ‌లేదా? ఇక్క‌డేదో జ‌రిగిపోతోంద‌ని.. సుప్రీంకోర్టు వ‌ర‌కు వెళ్లింది ఎవ‌రు? అని ప్ర‌శ్నించారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు మీరు చేసిందీ ఇదే క‌దా! అని బుగ్గ‌లు నొక్కుకున్నారు.

This post was last modified on July 24, 2023 5:42 pm

Share

Recent Posts

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

2 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

2 hours ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

2 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

3 hours ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

4 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

5 hours ago