Political News

వివేకానంద దారుణ హ‌త్య‌పై ఎంపీ 96 పేజీల‌ లేఖ‌?

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి.. క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి.. తాజాగా సీబీఐకి రాసిన 96 పేజీల లేఖ సంచ‌ల‌నంగా మారింది. వాస్త‌వానికి ఇప్ప‌టికే సీబీఐ ఎంపీ అవినాష్‌రెడ్డిని ప‌లుమార్లు విచారించింది. అంతేకాదు.. ఇప్ప‌టికీ ప్ర‌తిశ‌నివారం విచార‌ణ చేస్తూనే ఉంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేర‌కు ఎంపీ ప్ర‌తి శ‌నివారం విచార‌ణ‌కు హాజ‌ర‌వుతున్నారు.

ఇప్పుడు తాజాగా ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐకి లేఖ రాయ‌డం సంచ‌ల‌నంగా మారింది. అది కూడా.. 96 పేజీల లేఖ‌లో నేరుగా సీబీఐ అధికారి, గ‌తంలో ఈ కేసును విచారించిన రామ్ సింగ్‌పైనే విమ‌ర్శ‌లు చేయ‌డం.. ఇప్పుడు మ‌రింత ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఈ లేఖ మొత్తంగా.. రామ్ సింగ్ చుట్టూ తిరిగింది. ఆయ‌న ఉద్దేశ‌పూర్వ‌కంగానే త‌మ‌ను ఈ కేసులో ఇరికించార‌ని.. ద‌స్త‌గిరికి సాయం చేశార‌ని పేర్కొన్నారు.

అంతేకాదు.. ఒక హంత‌కుడు(ద‌స్త‌గిరి) చెప్పిన విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని, ఆయ‌న‌కు బెయిల్ కూడా ఇప్పించేందుకు స‌హ‌క‌రించార‌ని ఎంపీ అవినాష్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు. “ఇదంతా ఆయ‌నే (రామ్ సింగ్‌) చేశారు. న‌న్ను, నా తండ్రిని ఇరికించారు. అస‌లు హంత‌కుల‌ను విచారించ‌డం మానేశారు. ద‌ర్యాప్తునంతా రామ్‌సింగ్ ప‌క్ష‌పాతంగా చేశారు. ఇదంతా సునీత(వివేకా కుమార్తె) ప్రోద్బ‌లంతోనే చేశారు” అని తాజాగా సీబీఐ డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ సూద్‌(ఇటీవ‌ల బాధ్య‌త‌లు చేప‌ట్టారు) కు లిఖిత పూర్వ‌క ఫిర్యాదు చేశారు.

రాజ‌కీయ‌కోణంలోనే ఈ హత్య జ‌రిగింద‌న‌డం అవాస్త‌వమ‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో త‌న‌ను, త‌న తండ్రి భాస్క‌ర‌రెడ్డిని, స్నేహితుడు గ‌జ్జ‌ల ఉద‌య్‌కుమార్‌రెడ్డిని కేసులో ఇరికించార‌ని పేర్కొన్నారు. మొత్తంగా త‌మ త‌ప్పు ఏమీలేద‌ని, ఇది ఆస్తి వివాదాలు, వివేకా సెకండ్ మ్యారేజీ చుట్టూ తిరిగిన విష‌య‌మ‌ని ఎంపీ అవినాష్ పేర్కొన్నారు. అయితే.. ఇలా సీబీఐ డైరెక్ట‌ర్ మార‌గానే ఆయ‌న లేఖ సంధించ‌డం వెనుక వ్యూహాలు ఉన్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ఇవీ.. వ్యూహాలు(ప‌రిశీల‌కులు చెబుతున్న‌వి-క‌డ‌ప‌లో చ‌ర్చ‌కు వ‌స్తున్న‌వి)

  • కేసు కొలిక్కి వ‌స్తున్న ద‌శ‌లో.. లేఖ రాయ‌డంపై అనుమానాలు
  • ఇప్ప‌టికే ఒక‌సారి రామ్ సింగ్‌(ఈ కేసును విచారించిన అధికారి)ని మార్చ‌మ‌న్న అభ్య‌ర్థ‌న‌తో ఆయ‌న‌ను మార్చేశారు. మ‌ళ్లీ ఆయ‌న‌పై నింద‌లు మోప‌డం వెనుక‌.. ఉద్దేశ పూర్వ‌క‌మే.
  • కేసును కూలంక‌షంగా తెలంగాణ హైకోర్టే ప‌రిశీలిస్తోంది. అయినా.. సందేహాలు వ్య‌క్తం చేయ‌డం వెనుక కేసును సాగ‌దీసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

This post was last modified on July 24, 2023 1:06 pm

Share

Recent Posts

అమితాబ్ టెక్నిక్ ఫాలో అయితే… మీ స‌తీమ‌ణి టైమ్‌కి రెడీ!

ఏదైనా పెళ్లో.. మ‌రో ఫంక్ష‌నో.. భార్యా భ‌ర్త‌లు ఇరువురు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు.. స‌హ‌జంగా దంప‌తుల్లో ఉత్సాహం ఉంటుంది. భ‌ర్త ముందుగానే…

58 minutes ago

లెక్క తప్పుతున్న యూత్ సినిమాలు

యువతను లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీయడం మంచిదే. అందులోనూ జెన్ జీ అభిరుచులను అర్థం చేసుకుని, వాళ్లకు అనుగుణంగా తక్కువ…

2 hours ago

నిన్న సందీప్ వంగ… నేడు శ్రీకాంత్ ఓదెల

మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…

2 hours ago

దీపావళికి డబ్బింగుల జోరు… టాలీవుడ్ హీరోలు లేరు

నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…

3 hours ago

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

8 hours ago