Political News

ఎగ్గొట్టే ఉద్దేశ్యం లేదంటోన్న వైసీపీ ఎమ్మెల్యే

పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆస్తుల వేలం అంటూ సంచలన ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆయనకు సంబంధించిన ఆస్తులు వేలం వేసేందుకు కెనరా బ్యాంకు రెడీ అయిందంటూ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఆస్తులను వేలం వేస్తున్నట్టు కెనరా బ్యాంకు బహిరంగ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్పందించారు. కరోనా సమయంలో వ్యాపారాలు రన్ కాలేదని, అందుకే బ్యాంకుకు రుణాలు చెల్లించడం ఆలస్యం అయ్యిందని ఆయన అంగీకరించారు. అయితే, అప్పు ఎగ్గొట్టాలన్న ఉద్దేశ్యం లేదని, తాను పారిపోయే వాడిని కాదని చెప్పారు. తన పార్టీకి చెందిన కొందరు నేతలే తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

కంపెనీలో వ్యాపారం జరుగుతోందని, రావాల్సిన బకాయిలు రాలేదని చెప్పుకొచ్చారు. బ్యాంకులకు బిల్లులు చెల్లిస్తున్నానని, వ్యాపార లావాదేవీలలో ఒడిదుడుకులు సహజమని అన్నారు. చెల్లింపు కొంచెం లేట్ అయినంత మాత్రాన ఎగ్గొట్టి పోతారనడం దారుణమని అన్నారు. రూ.1500 కోట్లు విలువైన పనులు జరిగాయని, బకాయిలు రావాల్సి ఉందని అన్నారు. అవి వచ్చిన వెంటనే బ్యాంకు రుణాలు చెల్లిస్తామని వివరణనిచ్చే ప్రయత్నం చేశారు. రాజకీయాన్ని రాజకీయంగా చూడాలని, వ్యాపారాన్ని వ్యాపారంగా చూడాలని అన్నారు. తాను మళ్లీ పోటీ చేస్తే మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఓడిపోతారని ఇలాంటి జిమ్మిక్కులు ఆడుతున్నారని మండిపడ్డారు.

తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సాయి సుధీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ… కెనరా బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని చెల్లించలేదు. ఆ రుణాలకు శ్రీధర్ రెడ్డి హామీ ఉన్నారు. దీంతో, కంపెనీతో పాటు, శ్రీధర్ రెడ్డి ఆస్తులను ఆగస్టు 18న వేలం వేయనున్నట్టు బ్యాంకు ప్రకటించిన విషయం తెలిసిందే.

This post was last modified on July 23, 2023 10:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇలాంటి సమయంలో పార్లమెంటుకు రాకపోతే ఎలా రాహుల్ జీ

కాంగ్రెస్ అగ్ర‌నేతే కాదు.. లోక్‌స‌భలో విప‌క్ష నాయ‌కుడు కూడా అయిన రాహుల్‌గాంధీ.. త‌ర‌చుగా త‌ప్పులు చేస్తూనే ఉన్నారు. అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు…

5 minutes ago

ఇడియట్స్ జోలికి ఇప్పుడెందుకు వెళ్లడం

2009లో విడుదలైన బాలీవుడ్ మూవీ 3 ఇడియట్స్ ఒక సంచలనం. అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోని కాలేజీ స్టూడెంట్…

34 minutes ago

`స‌నాత‌న ధ‌ర్మం` స్టాండ్.. సాయిరెడ్డిని ర‌క్షిస్తుందా.. ?

వైసీపీ మాజీ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల…

2 hours ago

సినిమా నచ్చకపోతే బాలేదని నలుగురికి చెప్పండి

ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయ‌డం అన్న‌ది పెద్ద రిస్క్‌గా మారిపోయిన మాట వాస్త‌వం. ఇంట‌ర్నెట్, ఓటీటీల విప్ల‌వం వ‌ల్ల…

5 hours ago

‘ఫస్ట్ టైమ్’ ఎంపీకి ‘ఫస్ట్ ర్యాంక్’ ఎలా వచ్చింది?

టీడీపీ ఎంపీ, గుంటూరు పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌, తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో రాష్ట్రంలోని 25…

5 hours ago

శుభవార్త చెప్పబోతున్న అఖండ 2 ?

గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…

8 hours ago