Political News

కేసీయార్ పై ఒత్తిడి పెరిగిపోతోందా ?

రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలన్నా బీసీ సామాజికవర్గం ఓట్లే కీలకమన్న విషయం తేలిపోయింది. ఎందుకంటే అధికారంలోకి రావాలని అనుకుంటున్న కాంగ్రెస్, బీజేపీలో బీసీలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతలపై డిమాండ్లు పెరిగిపోతున్నాయి. సామాజికవర్గాల జనాభా ఆధారంగా బీసీలకు ప్రాధాన్యత దక్కాల్సిందే అని బీసీల నేతలు తీర్మానాలు కూడా చేస్తున్నారు. ఇదే సమయంలో ఇదే విషయమై బీఆర్ఎస్ లో కూడా కేసీయార్ పై ఒత్తిడి పెరిగిపోతోందని సమాచారం.

పై రెండు పార్టీలంటే ప్రతిపక్షంలో ఉన్నాయి కాబట్టి అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తామని హామీలిస్తాయి. కానీ బీఆర్ఎ గడచిన తొమ్మిదేళ్ళుగా అధికారంలోనే ఉన్నది. అయినా దామాషా ప్రకారం చూసుకుంటే బీసీలకు చేసింది తక్కువే. అందుకనే రాబోయే ఎన్నికల్లో ఎంపీ, ఎంఎల్ఏల టికెట్ల కేటాయింపులో బీసీలకు సరైన వాటా దక్కకపోతే కతేమిటో చూపిస్తామన్నట్లుగా బెదిరింపులు పెరిగిపోతున్నాయట. అప్పుడెప్పుడు బీసీలకు హామీ ఇచ్చినట్లుగా ఆత్మగౌరవ భవన్ల నిర్మాణాలు పూర్తేకాలేదు.

ఎంబీసీ కార్పొరేషన్ కు ఛైర్మనే లేరు. బీసీల సంక్షేమం కోసం కేటాయించిన నిధుల్లో ఖర్చయినవి చాలా తక్కువట. ఇక కేబినెట్లో బీసీ మంత్రుల సంఖ్య మూడు మాత్రమే. రెడ్లు 6 మంది వెలమలు నలుగురికి అవకాశం ఇచ్చిన కేసీయార్ బీసీల్లో మాత్రం ముగ్గురినే తీసుకున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఈటెల రాజేందర్ ను అవమానించిన తీరు కేసీయార్ పై వ్యతిరేకతను పెంచిందని సమాచారం. ప్రస్తుతం బీఆర్ఎస్ కు 105 మంది ఎంఎల్ఏలుంటే అందులో బీసీల సంఖ్య 22 మాత్రమే.

అదే రెడ్డి సామాజికవర్గం నుండి 36 మందుంటే వెలమలు 10 మందున్నారు. నిజానికి వెలమల సంఖ్య చాలాచాలా తక్కువ. కాకపోతే కేసీయార్ ది అదే సామాజికవర్గం కాబట్టే అవసరానికి మించిన ప్రాధాన్యత దక్కుతోందని బీసీనేతలు మండిపోతున్నారు. గొర్లె పంపిణీ పథకం ఎక్కడికి పోయింది తెలీదు. బీసీ బంధు ఏమైందో కూడా చెప్పలేరు. బీసీలకు న్యాయపరంగా దక్కాల్సింది కూడా దక్కనీయకలేదనే మంట బీసీల్లో  పెరిగిపోతోందట. అందుకనే వాస్తవాలు గ్రహించే బీసీలను మంచిచేసుకునే పనిలో కేసీయార్ ప్లాన్లు వేస్తున్నారట. మరి ఆ ప్లేన్లేమిటో ? బీసీలు ఏమిచేస్తారో చూడాలి. 

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇలాంటి సమయంలో పార్లమెంటుకు రాకపోతే ఎలా రాహుల్ జీ

కాంగ్రెస్ అగ్ర‌నేతే కాదు.. లోక్‌స‌భలో విప‌క్ష నాయ‌కుడు కూడా అయిన రాహుల్‌గాంధీ.. త‌ర‌చుగా త‌ప్పులు చేస్తూనే ఉన్నారు. అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు…

46 minutes ago

ఇడియట్స్ జోలికి ఇప్పుడెందుకు వెళ్లడం

2009లో విడుదలైన బాలీవుడ్ మూవీ 3 ఇడియట్స్ ఒక సంచలనం. అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోని కాలేజీ స్టూడెంట్…

1 hour ago

`స‌నాత‌న ధ‌ర్మం` స్టాండ్.. సాయిరెడ్డిని ర‌క్షిస్తుందా.. ?

వైసీపీ మాజీ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల…

2 hours ago

సినిమా నచ్చకపోతే బాలేదని నలుగురికి చెప్పండి

ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయ‌డం అన్న‌ది పెద్ద రిస్క్‌గా మారిపోయిన మాట వాస్త‌వం. ఇంట‌ర్నెట్, ఓటీటీల విప్ల‌వం వ‌ల్ల…

6 hours ago

‘ఫస్ట్ టైమ్’ ఎంపీకి ‘ఫస్ట్ ర్యాంక్’ ఎలా వచ్చింది?

టీడీపీ ఎంపీ, గుంటూరు పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌, తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో రాష్ట్రంలోని 25…

6 hours ago

శుభవార్త చెప్పబోతున్న అఖండ 2 ?

గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…

8 hours ago