తొందరలోనే చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ భేటీ కాబోతున్నట్లు సమాచారం. ఈమధ్యనే ఢిల్లీలో జరిగిన ఏన్డీయే సమావేశానికి పవన్ హాజరైన విషయం తెలిసిందే. ఢిల్లీ టూరులో అమిత్ షా, జేపీ నడ్డాలతో పవన్ భేటీ అయ్యారు. ఆ వివరాలను చంద్రబాబుతో షేర్ చేసుకోవటంతో పాటు భవిష్యత్ రాజకీయాలపై చర్చలు జరిపేందుకు తొందరలో భేటీ అవ్వాలని డిసైడ్ అయ్యారట. పరిస్ధితిలు అనుకూలిస్తే రెండు, మూడురోజుల్లోనే సమావేశమయ్యే అవకాశాలున్నాయని టీడీపీ వర్గాలు చెప్పాయి.
అమిత్ తో భేటీ తర్వాత పవన్ వైఖరిలో స్పష్టమైన తేడా కనబడుతోంది. భేటీకి ముందు అంటే గడచిన నాలుగేళ్ళలో కానీ లేదా రీసెంట్ వారాహియాత్రలో కూడా పవన్ ఎక్కడా బీజేపీ ప్రస్తావన తెచ్చిందిలేదు. ఎక్కడ మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా జనసేనకు ఓట్లేయండి, తనను ముఖ్యమంత్రిని చేయండని మాత్రమే పవన్ చెబుతున్నారు. వారాహియాత్రలో ఈ విషయం స్పష్టంగా అందరికీ కనబడింది. ఏరోజు కూడా తమకు బీజేపీ మిత్రపక్షమని పొరబాటున కూడా పవన్ ప్రస్తావించిందిలేదు.
పైగా బీజేపీతో మిత్రపక్షంగా ఉంటూనే చంద్రబాబుతో మూడుసార్లు భేటీ అయ్యారు. టీడీపీని కూడా కలుపుకునే తమ మూడుపార్టీలు ఎన్నికల్లో వెళతాయని చాలాసార్లు చెప్పారు. అయితే ఇదంతా గతంగా మారిపోయిందిపుడు. ఎందుకంటే ఢిల్లీ నుండి తిరిగొచ్చిన తర్వాత పార్టీ నేతలతో రెండుసార్లు సమావేశమయ్యారు. ఈ రెండుసార్లూ రాబోయే ఎన్నికల్లో ఎన్డీయేని గెలిపించమనే అడిగారు. ఎన్డీయే గెలుపుకి అందరం కష్టపడాలని చెప్పారు. మామూలుగా అయితే ఎన్డీయే అంటే బీజేపీ, జనసేన మాత్రమే.
ఎందుకంటే ఎన్డీయేలో టీడీపీ భాగస్వామ్యపార్టీ కాదు. బీజేపీ నేతల సమాచారం ప్రకారం రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన మాత్రమే కలిసి పోటీచేసే అవకాశాలున్నాయట. ఇదే నిజమైతే చంద్రబాబు కూడా హ్యాపీగానే ఉంటారని అనుకోవాలి. ఎందుకంటే పై రెండుపార్టీలతో పొత్తులు వద్దంటే వద్దని తమ్ముళ్ళు ఒత్తిడి పెడుతున్నారు. ఈ నేపధ్యంలోనే వీళ్ళిద్దరి భేటీపై రెండుపార్టీల్లోను ఉత్కంఠ మొదలైంది. బహుశా వీళ్ళిద్దరి భేటీ తర్వాత పోటీ విషయంలో క్లారిటి వచ్చేస్తుందనే అనుకుంటున్నారు. మరి భేటీ ఎప్పుడు జరుగుతుంది ? ఏమి క్లారిటి వస్తుందో చూడాల్సిందే.
This post was last modified on July 22, 2023 11:52 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…