తెలంగాణా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డికి అప్పుడే చుక్కలు కనబడుతున్నాయి. ప్రమాణస్వీకారం రోజునే సీనియర్ల మధ్య విభేదాలు బయటపడ్డాయి. దాంతో ఏమి చేయలేక వేదికమీద జరుగతున్నది కిషన్ చూస్తుండిపోయారు. ఇంతకీ విషయం ఏమిటంటే వేదిక మీద మాట్లాడుతు మాజీ అద్యక్షుడు బండి సంజయ్ కొందరు నేతలపై మండిపోయారు. ఢిల్లీకి వెళ్ళి ఫిర్యాదులు చేయటం మానుకోవాలని ఎవరిపేరును ప్రస్తావించకుండానే బండి చురకలంటించారు. ఫిర్యాదుల కారణంగానే తాను అధ్యక్షుడిగా తప్పుకోవాల్సొచ్చిందన్నట్లుగా మాట్లాడారు.
కొత్తగా బాధ్యతలు తీసుకుంటున్న కిషన్ రెడ్డినయినా ప్రశాంతంగా పనిచేసుకోనీయాలని హితవుచెప్పారు. ఇక వేదికమీదే ఉన్నప్పటికీ కిషన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఎడమొహం, పెడమొహంగానే ఉండిపోయారు. వేదికమీదకు వెళ్ళిన కోమటిరెడ్డి కిషన్ రెడ్డికి రెండువైపుల కూర్చున్న నేతలకు హలో చెప్పి చేయి కలిపారుగానీ కిషన్ కు మాత్రం హలో చెప్పలేదు, చేయి కలపలేదు. తర్వాత దూరంగా వెళ్ళి ఎక్కడో కూర్చున్నారు.
అలాగే విజయశాంతి అసంతృప్తి మరోరకం. ఆమె వేదికమీదకు చేరుకుని కిషన్ రెడ్డికి అభినందనలు, శుభాకాంక్షలు చెప్పారు. వెంటనే వేదిక దిగి అక్కడినుండి వెళ్ళిపోయారు. ఇదే విషయమై మీడియాతో మాట్లాడుతు ఒకపుడు తెలంగాణాను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణా వాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రయత్నించిన వారితో వేదికను పంచుకోవటం ఇష్టంలేకే అక్కడి నుండి వెళ్ళిపోయినట్లు చెప్పారు. విజయశాంతి చేసిన వ్యాఖ్యలు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి చేసినవే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.
ఎందుకంటే కిషన్ బాధ్యతలు తీసుకునేటపుడు వేదికమీద కిరణ్ కూడా ఉన్నారు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే చేర్చుకున్న పార్టీ పెద్దలకు, చేరిన కిరణ్ కు లేని బాధ విజయశాంతికి ఏమిటో అర్ధంకావటంలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తెలంగాణాను వ్యతిరేకించిన తాను ఇపుడు తెలంగాణా బీజేపీతో కలిసి ఎలా పనిచేయాలా అని ఆలోచించుకోవాల్సింది కిరణ్ మాత్రమే. అలాంటి కిరణ్ పాత విషయాలను పక్కనపెట్టేసి అన్నీ మరచిపోయినట్లుగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన నేతలు కూడా కిరణ్ తో బాగానే ఉన్నారు. మధ్యలో విజయశాంతికి ఏమైందో అర్ధంకావటంలేదు.
This post was last modified on July 22, 2023 11:43 am
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…