వాలంటీర్ల పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. పవన్ పై జగన్ సర్కార్ పరువు నష్టం కేసు పెట్టిన వ్యవహారంపై తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. పవన్ పై పరువు నష్టం కేసు పెట్టడం బుద్ధిమాలిన చర్య అని, నీతిమాలిన పని అని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రజలు ప్రశ్నిస్తే దాడులు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కేసులు అన్న రీతిలో జగన్ రాక్షస పాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జవాబుదారీగా ఉండాల్సింది పోయి అణచివేత ధోరణికి దిగడం ఏమిటని మండిపడ్డారు.
నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల వ్యక్తిగత వివరాలను వాలంటీర్లు సేకరిస్తున్నారని, దాన్ని ప్రశ్నించిన పవన్ పై కేసు ఎందుకు పెడుతున్నారని మండిపడ్డారు. ఆ సమాచారం సేకరించడమే ప్రభుత్వం చేస్తున్న తప్పు అని, దానిని దుర్వియోగం చేయడం నీచాతి నీచమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ కేసు పెట్టాల్సి వస్తే సీఎం జగన్ పైనే పెట్టాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వ వ్యవస్థలను ఆయన దుర్వినియోగం చేసిన విధానంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పరువు గురించి జగన్ మాట్లాడటం జోక్ అని, నాలుగేళ్ల దిక్కుమాలిన పాలనలో రాష్ట్ర పరువు, ప్రతిష్ట ఏనాడో మంట గలిసిపోయాయని నిప్పులు చెరిగారు.
ప్రజల గొంతుకను అణిచివేయడమే లక్ష్యంగా, అరాచక ఆలోచనలు చేయడమే జగన్ పని అని అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ప్రభుత్వానికి అప్పులు తెచ్చుకోవడంలో ఉన్న శ్రద్ధ.. రాష్ట్ర హక్కులు సాధించడంలో లేదని మండిపడ్డారు. విభజన చట్టం హామీల అమలు ద్వారా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పదేళ్ల రాష్ట్ర విభజన చట్ట కాలపరిమితి మరి కొద్ది నెలల్లో ముగుస్తున్నా జగన్ నిమ్మకునీరెత్తినట్లున్నారని దుయ్యబట్టారు. నాలుగేళ్లలో రాష్ట్రానికి కనీసం ఒక ప్రాజెక్టు గానీ, ఒక సంస్థను గానీ తీసుకొచ్చారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
This post was last modified on July 21, 2023 8:27 pm
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…