రాజకీయాల్లో చూసే కోణాలు.. వేసే అడుగులు ఎప్పుడు ఎలాగైనా మారొచ్చు. అవసరం-అవకాశం అనే రెండు పట్టాలపైనే ఏ రాజకీయ పార్టీ అయినా..అడుగులు వేస్తుంది. ముఖ్యంగా కాకలు తీరిన రాజకీయ నాయకులుగా పేరున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటివారు.. ఊరకరారు మహాను భావులు అన్నట్టుగా.. ఊరికేనే వారు ఏమీ చేయరు.. ఎవరినీ పిలవరు. ఆమూలాగ్రం అన్ని కోణాల్లోనూ ఆలోచించుకునే వారు ప్రయత్నాలు చేస్తారు. రాజకీయం చూస్తారు.
ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయాన్ని కొంత లోతుగా చూస్తే.. ఆయనను కలుపుకొని వెళ్లేందుకు బీజేపీ ముం దుకు వచ్చినట్టుగా కనిపిస్తోంది. తాజాగా జరిగిన ఢిల్లీ ఎన్డీయే కూటమి సమావేశానికి ఆయనకు ఆహ్వానం కూడా అందింది. దీంతో పవన్ అక్కడకు వెళ్లారు. అయితే.. దీనిపై సహజంగానే ఏపీలోని రాజకీయ పక్షాల నుంచి కొంత పెదవి విరుపులు కనిపిం చాయి. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్డీయేకూటమికి వెళ్లిన ఏకైక పార్టీ జనసేన, ఏకైకనాయకుడు కూడా పవనే కావ డం గమనార్హం. దీంతో ఆయననే బీజేపీ ఎందుకు ఆహ్వానించింది.. అసలు ఈ ఆహ్వానం వెనుక బీజేపీ చూస్తున్న యాంగిల్ ఏంటి? అనేది ఆసక్తిగా మారింది.
దీనిపై పెద్ద ఎత్తున చర్చ కూడా సాగుతోంది. పవన్ కళ్యాణ్‌ను రాజకీయ కోణంలో చూస్తే.. ఆయన గత ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. పైగా ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచినా..ఆయన కూడా పొరుగు పార్టీలో చేరిపోయారు. ఇక, క్షేత్రస్తాయిలో నిజాలు మాట్లాడుకుంటే.. బూత్ స్థాయి కమిటీలు లేవు, మండల స్థాయి యంత్రాంగం కూడా లేదు. ఇంటింటికీ తిరినే కార్యకర్తలు కూడా లేరు. పోనీ.. ఇవన్నీ కాకుండా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే.. పోటీ చేసే సామర్థ్యం ఉన్న 100 మంది నాయకులుకూడా లేరు. (ఇది కొందరికి నచ్చకపోవచ్చు. కానీ,నిజమే కదా!)
మరి ఏం చూసి.. బీజేపీ పవన్‌ను చేరదీసింది. పైగా.. వచ్చే ఎన్నికలుకీలకం కదా! అంటే.. ఈ విషయంలో బీజేపీ రాజకీయంగా కన్నా.. ఆయనకు ఉన్న సినిమా ఇమేజ్‌ను చూస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పవన్ కళ్యాణ్ కు సినీ అభిమానులు, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా వారు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు ఉన్న ఈ సినీ ఇమేజ్‌ను ఇరురాష్ట్రాలలోనూ వినియోగించుకోవాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ కోణంలోనే పవన్ బీజేపీ ఎక్కువగా ఆదరిస్తోందని విశ్లేషిస్తున్నారు.
This post was last modified on July 19, 2023 12:42 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…