విధేయతకు టీడీపీ అధినేత చంద్రబాబు పట్టం కట్టారు. రెండు దశాబ్దాలకు పైగా పార్టీని అంటిపెట్టుకుని పనిచేస్తున్న మాజీ పోలీసు వర్ల రామయ్య కుటుంబానికి మరో అవకాశం ఇచ్చారు. ఇప్పటికే ఒకసారి ఎమ్మెల్యే టికెట్, అదేవిధంగా పార్టీలో పొలిట్ బ్యూరో మెంబర్‌లో వర్లకు చంద్రబాబు ఛాన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. అదేవిదంగా గత ఏడాది జరిగిన రాజ్యసభ ఎన్నికల్లోనూ ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇక, వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కృష్నాజిల్లాలోని పామర్రు నియోజకవర్గం టికెట్‌ను ఇప్పుడు వర్ల వారసుడు, యువ నాయకుడు వర్ల కుమార్ రాజాకు చంద్రబాబు అప్పగించారు.
తాజాగా వచ్చే ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి నియోజకవర్గాన్ని అన్ని కోణాల్లోనూ విశ్లేషిస్తున్న చంద్రబాబు బలమైన, గెలుస్తారనే ధీమా ఉన్నవారికి దాదాపు టికెట్లను కన్ఫర్మ్ చేస్తున్నారు. ఈ పరంపరలో తాజాగా పామర్రు నియోజకవర్గం సీటును వర్ల కుమార్ రాజాకు కన్ఫర్మ్ చేసినట్టు ఎన్టీఆర్ భవన్ వర్గాలు తెలిపాయి. అంతేకాదు… ఒకరిద్దరు ఇక్కడ టికెట్ ఆశిస్తున్న వారు ఉన్నప్పటికీ.. నామినేటెడ్ పదవులు ఇస్తామని తేల్చి చెప్పారు.
మరోవైపు.. వైసీపీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కూడా టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. కానీ, ఆమెకు ఇవ్వలేమని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇంకా ఎవరైనా టికెట్ కోసం ఆశించేవారు ఉన్నప్పటికీ.. వారంతా పార్టీని గెలిపించేందుకు పనిచేయాలని.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. వారిని వేరే రూపంలో సంతృప్తి పరుస్తామని చంద్రబాబు తేల్చి చెప్పినట్టు తెలిసింది. ఇప్పటికైతే.. వర్ల కుమార్ రాజానేనని.. ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదని కూడా చంద్రబాబు ప్రకటించారు.
అదే సమయంలో వర్ల కుమార్ రాజా కూడా మరింత ఉద్యమించాలని.. ప్రతి ఇంటికీ తిరిగి మినీ మేనిఫెస్టోను వివరించాలని.. సీనియర్లను , జూనియర్లను కలుపుకొని పోవాలని.. ఏ సందేహం వచ్చినా..అడిగి తెలుసుకోవాలని సూచించారు. విభేదాలు.. వివాదాలు పరిష్కారం కావని.. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు కలివిడిగానే ముందుకు సాగాల్సి ఉంటుందని చంద్రబాబు ఆయనకు దిశానిర్దేశం చేశారు. దీంతో వర్ల కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. విధేయతకు వీర తాడు వేశారని.. వర్ల కుమార్ రాజా కూడా హర్షం వ్యక్తం చేయడం గమనార్హం.
This post was last modified on July 19, 2023 12:37 pm
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…