Political News

విభ‌జ‌న చ‌ట్టానికి ముగింపు కాలం.. వైసీపీ కోర్టులో కీల‌క బాల్‌!

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను విభ‌జిస్తూ.. 2014లో కాంగ్రెస్ చేసిన విభ‌జ‌న చ‌ట్టానికి కాలం ముగిసిపోతోంది. మొత్తం 10 సంవ‌త్స‌రాల పాటు అమ‌ల్లో ఉండేలా.. ఈ విభ‌జ‌న చ‌ట్టాన్ని అప్ప‌ట్లో రూపొందించారు. ఈ క్ర‌మంలో ఈ చ‌ట్టంలోని అంశాల‌ను ప‌దేళ్ల కాలంలో నెర‌వేర్చాల‌ని నిర్ధిష్టంగా పేర్కొన‌క‌పోయినా.. చ‌ట్టం గ‌డువును అనుస‌రించి ప‌దేళ్ల కాలంలో ఆయా అంశాల‌ను ఏపీకి.. అదేవిధంగా తెలంగాణ‌కు నెర‌వేర్చాల్సి ఉంది.

కానీ, తెలంగాణ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఏపీ అంశం ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఈ విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న మెజారిటీ అంశాల‌ను ఇప్ప‌టికీ మోడీ స‌ర్కారు నెర‌వేర్చ‌లేద‌ని అటు మేధావులు, ఇటు రాజ‌కీయ ప‌రిశీల‌కులు కూడా చెబుతున్నారు. క‌డ‌ప ఉక్కుఫ్యాక్ట‌రీ నుంచి లోటు బ‌డ్జెట్ నిధుల వ‌ర‌కు.. పోల‌వ‌రం ముంపు ప్రాంతాల నుంచి విశాఖ మెట్రో వ‌ర‌కు.. విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ‌లోని ఆస్తుల‌ను పంచాల్సి ఉంది.

ఇక‌, రాజ‌ధాని విష‌యం మ‌రింత కీల‌కం. ఈ చ‌ట్టం ప్ర‌కారం.. ప‌దేళ్ల వ‌ర‌కు హైద‌రాబాద్ ఉమ్మ‌డి రాజ‌ధాని గా ఉంది. కానీ, ఎవ‌రికివారుగా ఉన్న‌ప్ప‌టికీ.. చ‌ట్టం ప్ర‌కారం అయితే.. ఇప్ప‌టికీ ఉమ్మ‌డిగా హైద‌రాబాద్ ను రాజ‌ధానిగా వాడుకునే వెసులుబాటు ఉంది. ఇక‌, ఈ విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న అంశాలు నెర‌వేర్చారా.. లేదా.. అనే విష‌యంతో సంబంధం లేకుండా.. కాలం అయితే ప‌రుగులు పెట్టేసింది.

వ‌చ్చే ఏడాది మే నాటికి ఈ విభ‌జ‌న చ‌ట్టం ప‌దేళ్లు పూర్తి చేసుకుని.. కాల‌తీతంగా మారిపోతుంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ఇప్ప‌టికిప్పుడు ఈ విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న ప్ర‌తి అంశాన్నీ సాధించాల్సి ఉంటుంది. ఒక‌వేళ సాధించ‌లేని.. సాధ్యం కాని ద‌శ‌లో .. ఈ చ‌ట్టం కాల ప‌రిమితిని మ‌రో ఐదేళ్ల‌పాటు పెంచేలా అయినా.. పార్ల‌మెంటులో పోరాటం చేయాల్సి ఉంటుంది. ఒక‌సారి కాలం తీరిపోయిన త‌ర్వాత‌.. మ‌ళ్లీ పెంచేందుకు పార్ల‌మెంటులో పెద్ద త‌తంగ‌మే చేయాల్సి ఉంటుంది. సో.. ఇప్పుడు విభ‌జ‌న చ‌ట్టం తాలూకు.. ప‌రిణామాల్లో మంచి జ‌ర‌గాలంటే.. వైసీపీ పూనిక వ‌హించ‌క‌త‌ప్ప‌ద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

This post was last modified on July 18, 2023 2:30 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఏపీలో ఆ జిల్లాల‌కు ఒక క‌లెక్ట‌ర్‌-ముగ్గురు ఎస్పీలు !

ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం చెల‌రేగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను నిలువ‌రించ‌లేక పోయిన‌.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా క‌లెక్ట‌రు, ముగ్గురు ఎస్పీలు) వేటు…

14 hours ago

మహేష్ బాబు కోసం వరదరాజ మన్నార్ ?

ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…

14 hours ago

లండ‌న్‌లో జ‌గ‌న్… ఫ‌స్ట్ లుక్ ఇదే!

ఏపీ సీఎం జ‌గ‌న్ కుటుంబ స‌మేతంగా విహార యాత్ర‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. స‌తీమ‌ణి వైఎస్ భార‌తి, కుమార్తెలు హ‌ర్ష‌,…

16 hours ago

నమ్మశక్యం కాని రీతిలో కంగువ యుద్ధం

మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…

16 hours ago

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

21 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

23 hours ago