ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ కొత్త నియామకాలకు తెరదీశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పాటు.. నిబంధనల మేరకు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు కూడా ఆయన ఛాన్స్ ఇచ్చారు. అయితే.. త్వరలోనే ముగిసిపోనున్న అసెంబ్లీకి ఇప్పుడు కొత్తగా నియామకాలు చేపట్టడం ఏంటనేది ప్రశ్న. వాస్తవానికి మరో 8 మాసాల్లో ఏపీ అసెంబ్లీ గడువు తీరనుంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మహా అయితే.. మరో మూడు సార్లు మాత్రమే అసెంబ్లీ భేటీ ఉండే అవకాశం ఉంది.
అంటే.. వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు, వచ్చే ఏడాది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం జరిగే సభ. అవి కూడా మూడు నుంచి నాలుగు రోజులు మాత్రమే జరగే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు కావడంతో ప్రతిపక్షాల దూకుడు పెరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వాలు సహజంగానే సభా కాలాన్ని కుదించుకుంటాయి. మరి ఇలాంటి అసెంబ్లీలో ఇప్పుడు సభా హక్కుల కమిటీ పేరిట ఎమ్మెల్యేలకు పోస్టులు ఇచ్చారు. ఈ కమిటీకి చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని నియమించారు.
ఇతర సభ్యులుగా కోన రఘుపతి(బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే-బ్రాహ్మణ), భాగ్యలక్ష్మి(పాడేరు ఎమ్మెల్యే-ఎస్టీ), సుధాకర్ బాబు(సంతనూతలపాడు-ఎస్సీ), అబ్బయ్య చౌదరి(దెందులూరు-కమ్మ), చిన అప్పలనాయుడు(బొబ్బిలి ఎమ్మెల్యే), అనగాని సత్యప్రసాద్(టీడీపీ నాయకుడు, రేపల్లె ఎమ్మెల్యే-బీసీ)లకు అవకాశం ఇచ్చారు. మొత్తం ఏడుగురు సభ్యులతో ఈ కమిటీని నియమించారు. వీరికి అసెంబ్లీలోనే కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు తాజాగా ఇచ్చిన జీవోలో పేర్కొ న్నారు.
అదేసమయంలో మరో తొమ్మిది అనుబంధం కమిటీలను కూడా నియమిస్తూ.. ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే.. అసెంబ్లీ ముగిసిపోతున్న సమయంలో ఈ పదవులు ఇచ్చి.. ఏం చేయాలని అనుకుంటున్నట్టు అనేది రాజకీయ వర్గాల్లో ప్రశ్న. ఆయా సామాజిక వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని తగ్గించేందుకు ఈ ప్రయత్నం చేశారా? అనే చర్చ సాగుతోంది.
This post was last modified on July 17, 2023 10:36 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…