Political News

కేసీఆర్ పై పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు

సాధారణంగా రాజకీయ నాయకులన్న తర్వాత హామీలివ్వడం సర్వ సాధారణం. ఎన్నికలకు ముందు..తర్వాత అని తేడా లేకుండా హామీలివ్వడం, నిధులు మంజూరు చేస్తామని వాగ్దానాలు చేయడం సహజం. అయితే, వాటిలో చాలా హామీలు బుట్టదాఖలు అయిన సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. ఆ హామీలకు, వాగ్దానాలను ప్రతిపక్ష నేతలు కూడా చూసీచూడనట్లు పోతుంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రం హామీలిచ్చిన ముఖ్యమంత్రిపైన విమర్శలు గుప్పించి మమా అనిపిస్తారు. కానీ, ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ పొలిటిషియన్, భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాత్రం ఆ కేటగిరీలోకి తాను రానంటున్నారు.

ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ పై పొదెం వీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన వైనం ఇపుడు తెలంగాణ రాజకీయాలలో సంచలనం రేపుతోంది. దాదాపు ఏడాది క్రితం భద్రాచలానికి తీవ్ర స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. ఆ సమయంలో దాదాపుగా భద్రాద్రి ఆలయం కూడా కొంత వరకు మునిగిపోయింది. ఇక, భద్రాచలంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఆ సమయంలో వందలాది ఇళ్లు, దుుకాణాలు వరద బీభత్సానికి కొట్టుకుపోగా…వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలోనే భద్రాచలానికి రూ.1000 కోట్లు నిధులు కేటాయిస్తానని కేసీఆర్ హామీనిచ్చారు.

అయితే, ఆ మాట ఇచ్చి ఏడాది గడుస్తున్నా…ఇంకా ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల కాలేదు. దీంతో, స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కేసీఆర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. భద్రాచలం ప్రజలను కేసీఆర్ మోసం చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని, ఆయనపై కేసు పెట్టాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు, గతంలో రామాలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించిన కేసీఆర్…పైసా కూడా ఇవ్వలేదని ఆయన ఫిర్యాదులో ప్రస్తావించారు.

భద్రాచలంలో కరకట్ట పటిష్టత, ఎత్తు పెంచడానికి, ముంపు కాలనీల ప్రజల పునరావాసానికి కేసీఆర్ వెయ్యి కోట్లు ప్రకటించారని, కానీ, ఏడాది గడిచినా నిధులు మంజూరు చేయలేదని చెప్పారు. తాజాగా, వర్షాలు కురుస్తుండటంతో మళ్లీ గోదావరి ఉప్పొంగే అవకాశం ఉందని, ఈ సంవత్సరం కూడా భద్రాచల ప్రాంత ప్రజలు గోదావరి ముంపునకు గురికావాల్సిందేనా అనిప్రశ్నించారు.

This post was last modified on July 17, 2023 10:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పుష్ప కాదు జై భీమ్ హీరో అంటోన్న సీతక్క!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…

12 minutes ago

చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకున్నా సరే..

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…

31 minutes ago

రేవంత్ దగ్గరికి సినీ పెద్దలు?

పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…

47 minutes ago

మోహన్ లాల్ సినిమా.. సౌండ్ లేదేంటి?

మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…

1 hour ago

బన్నీ గొడవ.. నేషనల్ మీడియాకు సీపీ క్షమాపణ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…

2 hours ago

మంచి ఛాన్స్ మిస్సయిన రాబిన్ హుడ్!

క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…

2 hours ago