Political News

ఆ ఎమ్మెల్యే చేసిన అతే శాపమైందా?

ఈ మధ్య ఒక రోజు చిత్తూరు జిల్లాలో 25 కరోనా కేసులు బయటపడ్డాయి. అందులో 24 కేసులు ఒక్క శ్రీకాళహస్తి పట్టణం నుంచే కావడం గమనార్హం. అసలు చిత్తూరు జిల్లాలో తొలి కరోనా కేసు బయటపడిందే శ్రీకాళహస్తిలో. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 70 దాటగా అందులో రెండింట మూడొంతుల కేసులు శ్రీకాళహస్తిలోనే ఉండటం గమనార్హం.

ఇప్పుడు ఈ పట్టణంలో కరోనా ప్రమాదకరమైన మూడో దశలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించారు కూడా. ఐతే శ్రీకాళహస్తిలో కరోనా ఇంతగా తీవ్ర రూపం దాల్చడానికి కారణం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డినే అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల కిందట ఆయన పట్టణంలో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే.

కరోనా బాధితుల్ని ఆదుకోవడానికి ిివిరాళాలు అందజేసిన వాళ్ల ఫ్లెక్సీలు పెట్టి ఆయన భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ భారతి, ప్రభాస్, రతన్ టాటా.. ఇలా ప్రాంతీయ భేదాలు లేకుండా అందరి ఫ్లెక్సీలు పెట్టి ర్యాలీ నిర్వహించారు. కరోనా టైంలో భౌతిక దూరం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోకుండా ఎమ్మెల్యే ఇలా ర్యాలీ నిర్వహించడమేంటి.. ఈ ప్రచార ఆర్భాటం ఎందుకు అనే ప్రశ్నలు అప్పుడే వినిపించాయి.

ఇప్పుడు కాళహస్తిలో కరోనా కేసులు ఇంతగా పెరిగిపోవడానికి ఆ ర్యాలీనే కారణమని అభిప్రాయపడుతున్నారు. ఆ ర్యాలీ దృశ్యాలు చూస్తే ఈ ఆరోపణల్లో నిజం లేకపోలేదని అర్థమవుతుంది. అక్కడ పది మందికి పైగా ప్రభుత్వ సిబ్బంది కూడా కరోనా బారిన పడగా.. వాళ్లంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొన్న వారే అని కూడా అంటున్నారు.

ఈ ర్యాలీతో పాటు ప్రభుత్వం కరోనా సాయం కింద ప్రకటించిన వెయ్యి రూపాయల సాయాన్ని కూడా పెద్ద మీటింగ్ పెట్టి.. ఒక్కో లబ్దిదారును పిలిచి ఈ సాయం గురించి ప్రచారం సాగిస్తూ పంపకాలు చేయడం కూడా అప్పట్లో విమర్శలకు దారి తీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కాళహస్తిలో కరోనా వ్యాప్తికి ఎమ్మెల్యే చేసిన అతే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

This post was last modified on April 24, 2020 5:15 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

బన్నీ.. పవన్ కోసమేనా అలా?

మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…

21 mins ago

తారక్ బంధం గురించి రాజమౌళి మాట

దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…

1 hour ago

తులం బంగారం రూ.2 లక్షలు!

సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…

1 hour ago

టీడీపీ – జనసేన కూటమి మేనిఫెస్టోపై వైసీపీ భయాలివే.!

టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…

2 hours ago

OG అభిమానుల్లో అయోమయం

ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…

3 hours ago

జగన్ పై షర్మిల మోస్ట్ డామేజింగ్ కామెంట్

క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను క‌డ‌ప…

4 hours ago